భారత్‌లో ఇంటర్నెట్ వేగం నత్తనడకే..?

భారత్‌లో ఇంటర్నెట్ వాడకం పెరుగుతోన్న కొద్ది, దాని వేగం మందిగిస్తోంది. భారత్‌లో ఇంటర్నెట్ పరిస్థితులకు సంబంధించి అకామై టెక్నాలజీస్ పలు ఆశ్చర్యకర వివరాలను వెల్లడించింది.

భారత్‌లో ఇంటర్నెట్ వేగం నత్తనడకే..?

ఈ సంస్థ విడుదల చేసిన తాజా రిపోర్టులో భాగంగా ఆసియా-పసిఫిక్ దేశాల సగటు ఇంటర్నెట్ స్పీడ్‌లను వెల్లడించింది. ఈ జాబితాలో భారత్ 2.8 ఎంబీపీఎస్ సగటు స్పీడుతో అట్టడుగున నిలవగా, 26.7 ఎంబీపీఎస్ వేగంతో దక్షిణ కొరియా మొదటి స్థానంలో నిలిచింది.

Read More : జియో జోరు తగ్గుతోంది..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూరల్ ఇంటర్నెట్ సెక్టార్ ప్రభావం

భారత్‌లో గ్రామీణ ప్రాంతాల సంఖ్య ఎక్కువ. కేవలం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే రూరల్ ఇంటర్నెట్ సెక్టార్ పై దృష్టి సారిస్తున్నాయి. ప్రయివేటు టెలికాం ఆపరేటర్స్ అయిన ఎయిర్‌టెల్, నెక్ట్రా బ్రాడ్ బ్యాండ్ వంటి సంస్థలు అర్బన్ ప్రాంతాల్లో పూర్తిగా తమ ఆధిపత్యాన్ని కనబరుస్తున్నాయి.

జియో రాకతో...

రిలయన్స్ జియో రాకతో ఇంటర్నెట్  వేగం భారత్‌లో పెరిగిందనే చెప్పాలి. జనవరి 1, 2017 నుంచి జియో 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ మరింత విస్తరించే అవకాశముంది. 

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫెయిర్ యూసేజ్ పాలసీ

పలువురు ఆపరేటర్స్ అమలు చేస్తున్న ఫెయిర్ యూసేజ్ పాలసీ వినియోగదారుడి ఇంటర్నెట్ స్పీడ్ పై ప్రభావం చూపుతోంది. గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్‌‍ను పూర్తిస్థాయిలో చేరువ చేయటంలో ప్రభుత్వం విఫలమవుతోందనే చెప్పాలి. మరోవైపు, ప్రయివేటు ఆపరేటర్లు కూడా గ్రామీణ ప్రాంతాలను విస్మరిస్తున్నాయి. ఇంటర్నెట్ వేగాన్ని పెంచే సరైన మౌళిక సదుపాయాలు మన వద్ద లేకపోవటం కూడా నెట్ వేగం నెమ్మదించటానికి కారణమే.

ఇంటర్నెట్ బ్రౌజింగ్ అంటే..?

ఇంటర్నెట్ బ్రౌజింగ్.. ఇంటర్నెట్ సర్ఫింగ్.. వెబ్ బ్రౌజింగ్, ఈ పదసంబంధాలన్ని ఒకే అర్థాన్ని సూచిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని శోధించే క్రమంలో చేపట్టే ప్రక్రియ 'వెబ్ బ్రౌజింగ్'.

సెర్చ్ ఇంజిన్స్ ద్వారా...

గూగుల్, యాహూ తదితర సెర్చ్ ఇంజన్‌లకు సంబంధించిన వెబ్ సర్వర్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. ఈ వెబ్ సర్వర్లలో అనేక అంశాలకు సంబంధించిన హైపర్ టెక్స్ట్ డాక్యుమెంట్లను నిక్షిప్తం చేస్తారు. ఈ సమాచారాన్నిమనం వెబ్ బ్రౌజింగ్ లేదా ఇంటర్నెట్ సర్ఫింగ్ ద్వారా పొందగలుగుతున్నాం.

ఇంటర్నెట్ పరిభాషలో..

ఇంటర్నెట్ బ్రౌజింగ్ భాగంగా సమాచారాన్ని శోధిస్తున్నప్పుడు ఒక పేజి నుంచి మరొక పేజికి, ఒక వెబ్ సైట్ నుంచి మరొక వెబ్‌సైట్‌కు ప్రవేశిస్తుంటాం. ఇంటర్నెట్ పరిభాషలో ఈ ప్రక్రియను వెబ్ బ్రౌజింగ్ అంటారు. వెబ్ బ్రౌజింగ్‌కు కావల్సినవి.. ఇంటర్నెట్ కనెక్షన్, వెబ్ బ్రౌజర్, సంబంధిత వెబ్‌సైట్ లేదా వెబ్ పేజీకి సంబంధించిన యూఆర్ఎల్ (యూనివర్సల్ రిసోర్స్ లోకేటర్).

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Why is the internet speed slow in India?. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot