చైనా వస్తువులు తక్కువ ధరకే వస్తాయ్.. ఎందుకని?

Posted By:

ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ ధరలకు లభ్యమవుతన్న సెల్‌ఫోన్‌లు చైనావి మాత్రమే. క్వాలిటీ విషయాన్ని పక్కనబడితే సామాన్యులు సైతం సొంత చేసుకునే ధరల్లో చైనా మొబైల్ పోన్‌లు అందుబాటులో ఉన్నాయి. మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో అంతర్జాతీయంగా బ్రాండ్స్‌గా గుర్తింపుపొందిన యాపిల్, సామ్‌సంగ్, నోకియా, సోనీ, హెచ్‌టీసీలకు ధీటుగా చైనా బ్రాండ్‌లు అనేక మోడళ్లలో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి.

ఒక్క సెల్‌ఫోన్‌లు మాత్రమే కాదు పోర్టబుల్ కంప్యూటింగ్‌ను చేరువ చేసే ట్యాబ్లెట్ పీసీలు ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను చైనా బ్రాండ్‌లు ఆఫర్ చేస్తున్నాయి. తక్కువ జీతాలకే కూలీలు లభించటం. సమ్మెలు.. బంద్‌లు వంటి వాటికి చైనా కంపెనీలు దూరంగా ఉండటం కారణంగాగానే ఆ దేశ ఉత్పత్తి అంతలా ఎగబాకుతోంది. చైనాలో తయారయ్యే ఉత్పత్తులకు సంబంధించి పలు అసక్తికర అంశాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చైనా వస్తువులు తక్కువ ధరకే వస్తాయ్.. ఎందుకని?

1.) జూలై 29, 2010 లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చైనా అతిపెద్ద తయారీ శ్రామిక బలాన్ని కలిగి ఉంది. ఈ దేశంలో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య 112 మిలియన్‌లు.

చైనా వస్తువులు తక్కువ ధరకే వస్తాయ్.. ఎందుకని?

2.) ప్రపంచంలో అతిపెద్ద ఉత్పాదక దేశాల్లో చైనా ఒకటి.

చైనా వస్తువులు తక్కువ ధరకే వస్తాయ్.. ఎందుకని?

3.) ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న గొడుగుల్లో 70శాతం గొడుగులు చైనాలోనే తయారవుతాయి.

చైనా వస్తువులు తక్కువ ధరకే వస్తాయ్.. ఎందుకని?

4.) ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించే బటన్‌లలో 60శాతం చైనాలోనే తయారవుతాయి.

చైనా వస్తువులు తక్కువ ధరకే వస్తాయ్.. ఎందుకని?

5.) చైనా తయారు చేసిన ఉత్త్పత్తుల్లో 9శాతం సరుకు అమెరికాకు రవాణా అవుతుంది.

చైనా వస్తువులు తక్కువ ధరకే వస్తాయ్.. ఎందుకని?

6.) అమెరికా ప్రజానికం వినియోగిస్తున్న బూట్లలో 72శాతం చైనాలో తయారుకాబడినవే.

చైనా వస్తువులు తక్కువ ధరకే వస్తాయ్.. ఎందుకని?

7.) క్రిస్మిస్ సీజన్‌ను పురస్కరించుకుని అమెరికాలో ఉపయోగించే కృత్రిమ క్రిస్మస్ దీపాలు పూర్తిగా చైనాలో తయారు కాబడినవే.

చైనా వస్తువులు తక్కువ ధరకే వస్తాయ్.. ఎందుకని?

8.) అమెరికాలో ఉపయోగించే 50 శాతం గృహోపకరణాలు చైనాలో తయారు కాబడినవే.

చైనా వస్తువులు తక్కువ ధరకే వస్తాయ్.. ఎందుకని?

9.) అమెరికాలో ఉపయోగించే 50 శాతం బొమ్మలు చైనాలో తయారైనవే.

చైనా వస్తువులు తక్కువ ధరకే వస్తాయ్.. ఎందుకని?

10.) తక్కువ ధరల్లో లభ్యమయ్యే చైనా సెల్‌ఫోన్‌లకు రేడియేషన్ తాకిడి ఎక్కువ. ఉన్నత ప్రమాణాలు తక్కువ స్థాయిలో కలిగి ఉన్నఈ ఫోన్‌లు పలు సందర్భాల్లో విస్పోటనం చెందే అవకాశముంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot