Home
News

అరే ఏం జరిగింది.. సడన్‌గా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ను ఎందుకు డిలీట్‌ చేయాలనుకుంటున్నారు..?

టెక్‌ దిగ్గజం మెటా (Meta) నుంచి ఇటీవల కీలక ప్రకటన వెలువడింది. అయితే ఈ ప్రకటనపై అనేక మంది యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు మరో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇవి అంతిమంగా మెటా లాభం చేకూరుస్తాయా లేదా నష్టాన్ని రుచి చూపిస్తాయా తెలియాల్సి ఉంది. థర్డ్‌ పార్టీ చెకింగ్‌ సిస్టమ్‌ ను నిలిపివేయనున్నట్లు మెటా ఇటీవల ప్రకటన చేసింది. దీంతోపాటు కంటెంట్‌ మోడరేషన్‌ నిబంధనల్లో సడలింపులు సహా పొటిలికల్ కంటెంట్‌ పై ఆంక్షలు తగ్గించాలని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మెటా నిర్ణయంపై యూజర్ల అసంతృప్తి! :
మెటా తాజా నిర్ణయంపై ఫేస్‌బుక్‌ (Facebook), ఇన్‌స్టాగ్రామ్‌, థెడ్స్‌ యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో ఈ ప్లాట్‌ఫాంలలో నకిలీ వార్తలు, హానికర మరియు ఇతర కథనాలు పెరుగుదరలు కారణమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత భద్రత సహా ఇతర కారణాలతో మెటాకు చెందిన సోషల్‌ మీడియా (Social Media) ఖాతాలు తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఓ నివేదిక వెల్లడించింది.

users searching to delete meta social media platforms

ఎందుకు సోషల్‌ మీడియా అకౌంట్‌లను డిలీట్‌ చేయాలనుకుంటున్నారు?
గూగుల్‌ సెర్చ్‌ ఫలితాల్లో 'ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను ఎలా తొలిగించాలి?', 'ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఎలా డిలీట్‌ చేయాలి?', 'థ్రెడ్స్‌ (Threads) అకౌంట్‌ను ఎలా డిలీట్‌ చేయాలి?' వంటి సెర్చ్‌లు భారీగా పెరిగినట్లు తెలిసింది. గతంతో పోలిస్తే ఈ తరహా సెర్చ్‌ ఏకంగా 5000 శాతానికి పెరిగినట్లు గూగుల్‌ ట్రెండ్స్‌ వివరాల ఆధారంగా తెలుస్తోంది.

గతంలో ఆరోపణలు :
మెటాకు చెందిన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్‌ లో తప్పుడు వార్తలపై నియంత్రణ తగ్గిందని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా అమెరికాలో జనవరి 2021 సమయంలో జరిగిన ఘటనలకు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) పోస్టులు కూడా కారణం అయ్యాయంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో మెటా తమ ప్లాట్‌ఫాం కంటెంట్‌ పై దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

మెటా ఫ్యాక్ట్‌ చెకింగ్‌ :
నకిలీ వార్తలు, హానికర కంటెంట్‌ను కట్టడి చేసేందుకు మెటా ఫ్యాక్ట్‌ చెకింగ్‌ మరియు ఇతర నిబంధనలకు తీసుకొచ్చింది. అయితే తాజాగా ఫ్యాక్ట్‌ చెకింగ్‌ సిస్టమ్‌ ను ఎత్తివేయాలనే నిర్ణయంతో హానికర, తప్పుడు వార్తలు అధికమయ్యే అవకాశం ఉందని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతుందా?
ఇందులో భాగంగానే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్‌ కు ప్రత్యామ్నాయం వైపు అనేక మంది చూస్తున్నట్లు గూగుల్‌ సెర్చ్‌ ఫలితాల ఆధారంగా తెలుస్తోంది. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలో ఫ్యాక్ట్‌ చెకింగ్‌ సిస్టమ్‌ లేకుంటే ఎన్నికల సహా ఇతర ఘటనల సమయంలో తప్పుడు సమాచారం తీవ్రంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

మెటా ప్లాట్‌ఫాంలు థర్డ్‌ పార్టీ ప్యాక్ట్‌ చెకింగ్‌కు బదులుగా కమ్యూనిటీ నోట్స్‌ అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. అయితే మెటా తీసుకున్న నిర్ణయంతో భవిష్యత్‌లో ఫేస్‌బుక్‌ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల పరిస్థితి ఎలా మారనుందో తెలుస్తుంది. అయితే ఈ నిర్ణయం అనంతరం యూజర్లు ప్లాట్‌ఫాంను వీడారా లేదా అనేది తెలియలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
why many users searching to delete meta social media platforms here is the reason
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X