WhatsApp మెసేజింగ్ యాప్ ఇతర సోషల్ మీడియా యాప్ల కంటే ఎందుకు ఎక్కువ ప్రాచుర్యం పొందింది..
2021 సంవత్సరం ప్రారంభం అయింది. టెక్నాలజీ పరంగా 2020 బాగానే వృద్ధి చెందింది. 2020లో సోషల్ మీడియా యాప్ లు అధికంగా వినియోగించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్కువగా ఉపయోగించిన వాటిలో వాట్సాప్ అన్నిటి కంటే ముందు వరుసలో ఉంది. సోషల్ మీడియా యాప్ లలో వాట్సాప్ కంటే ముందు ఫేస్‌బుక్ వంటివి వచ్చినప్పటికీ మార్కెటింగ్ విషయంలో కొద్దిగా బిన్నంగా ఉంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ యాప్ ల ప్రాముఖ్యత ఎలా ఉందొ తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు ఇతర సామాజిక ప్లాట్‌ఫారమ్‌లన్నీ కూడా తమ యొక్క స్నేహితులు, కుటుంబసభ్యులు మరియు సహోద్యోగులకు ఒకే సారి మెసేజ్ లను ప్రసారం చేయడానికి రూపొందించబడ్డాయి. అయితే వాట్సాప్ మాత్రం ఇద్దరు వ్యక్తులను సాధారణంగా మెసేజ్, వాయిస్ కాల్స్ మరియు వీడియో కాల్స్ ద్వారా కమ్యూనికేట్ చేసే విధంగా తయారుచేసారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోని కొన్ని యాప్ లలో ట్విట్టర్ ట్వీట్ల ద్వారా, ఫేస్‌బుక్ లో పోస్ట్‌ల ద్వారా లేదా ఫేస్‌బుక్ వ్యాఖ్యల ద్వారా తాము ఏది పోస్ట్ చేసినా కూడా అందరికి చేరుతుంది. ఇందులో అందరికి లేదా కొందమందికి మాత్రమే మీ యొక్క మెసేజ్ చేరే సదుపాయం కూడా ఉంది. అయితే మొబైల్ మెసేజ్ వలె కొంతమందికి ప్రైవేట్ గా ఉపయోగించడానికి వాట్సాప్ ను ఉపయోగించవచ్చు.

వాట్సాప్ యొక్క అకౌంట్ పొందడానికి ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అవసరం ఉంటుంది. అయితే ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి అకౌంట్లను క్రియేట్ చేయడానికి ఫోన్ నెంబర్ లేదా ఈ-మెయిల్ ఐడి ఉన్నా కూడా సరిపోతుంది. వీటిని మీ యొక్క మొబైల్ ఫోన్ లలో ఓపెన్ చేయడంతో పాటుగా డెస్క్ టాప్ మరియు లాప్ టాప్ లలో కూడా మీ యొక్క పాస్వర్డ్ ఉపయోగించి ఓపెన్ చేయవచ్చు. అయితే వాట్సాప్ ను మొదట స్మార్ట్ ఫోన్లలో ఓపెన్ చేసిన తరువాతనే డెస్కటాప్ లలోను స్కాన్ చేసి ఓపెన్ చేయవచ్చు.

WhatsApp కొత్త ఫీచర్లు
వాట్సాప్ ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు కొత్త కొత్త అప్ డేట్ లను విడుదల చేస్తూ వచ్చింది. ఇది గత సంవత్సరం మరొకరికి డబ్బులను పంపడానికి UPI పేమెంట్ ఫీచర్లను కూడా చేర్చింది. వాట్సాప్ ను సోషల్ మీడియా యాప్ గా చాలా మంది పరిగణలోకి తీసుకోరు. అయినప్పటికీ ఇది ఇటు సోషల్ మీడియా యాప్ లకు మరియు అటు పేమెంట్ యాప్ లకు, మెసేజింగ్ యాప్లకు మరియు వీడియో కాలింగ్ యాప్ లకు కూడా తీవ్రమైన పోటీని ఇస్తున్నది.

వాట్సాప్ పురోగతి
ప్రపంచం మొత్తం మీద ఎక్కువ మంది ఉపయోగిస్తున్న దాని ప్రకారం చూసుకున్న కూడా వాట్సాప్ అందరి కంటే ముందు వరుసలో ఉంది. అలాగే పురోగతి పరంగా చూసుకున్నా కూడా ఇతర సోషల్ మీడియా యాప్ లతో పోలిస్తే వాట్సాప్ జనాలలోకి అతి త్వరగా వెళ్ళింది. వాట్సాప్ ప్రారంభం అయిన మొదటి సంవత్సరం నుంచి కూడా మంచి జనాదరణను పొందింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్న వారు ఇతర సోషల్ మీడియా యాప్ ను ఉపయోగించిన లేకపోయినా కూడా వాట్సప్ ను మాత్రం ఖచ్చితంగా ఉపయోగిస్తున్నారు. దీనిని బట్టి చెప్పవచ్చు వాట్సాప్ మిగిలిన వాటితో పోలిస్తే ఎంత బిన్నంగా ఉందొ అని.


Click it and Unblock the Notifications








