అశ్లీల యాడ్స్, యూజర్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన IRCTC

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐఆర్‌సిటిసి ) అంటే చాలామంది ఇష్టపడుతుంటారు. రైల్వే ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్తగా సేవలను అందిస్తూ వస్తోంది. ఇండియన్ రైల్వే రోజురోజుకు తన..

|

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐఆర్‌సిటిసి ) అంటే చాలామంది ఇష్టపడుతుంటారు. రైల్వే ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్తగా సేవలను అందిస్తూ వస్తోంది. ఇండియన్ రైల్వే రోజురోజుకు తన వెబ్ సైట్లో ప్రయాణికులకు అనువుగా మార్పులు చేసుకుంటూపోతోంది. ఇందులో భాగంగానే ముందుగానే టికెట్లను రిజర్వ్ చేసుకునే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పించింది.

అశ్లీల యాడ్స్, యూజర్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన IRCTC

అలాగే యూజర్ల నుంచి వచ్చే వివిధ రకాల సమస్యలను సత్వరమే పరిష్కరించడంలో కూడా మంచి పేరు గడించింది. యూజర్ నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించే క్రమంలో ఈ మధ్య IRCTCకి యూజర్ నుంచి ఓ వింత అనుభవం ఎదురైంది. ఐఆర్‌సీటీసీ అధికారిక యాప్ ఓపెన్ చేస్తే పోర్న్ యాడ్స్ వస్తున్నాయని, తరచూ అశ్లీల ప్రకటనలు చూడాల్సి వస్తోందని ఓ వ్యక్తి ట్విట్టర్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. ఐఆర్‌సీటీసీ అధికారిక ట్విట్టర్ ఖాతాతో పాటు రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ ట్విట్టర్ హ్యాండిల్స్‌కు తన కంప్లైంట్‌ను ట్యాగ్ చేశాడు. దీనికి IRCTC కూడా అదే స్థాయిలో అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. ట్విట్టర్లో చోటు చేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అశ్లీల యాప్స్,

సాధారణంగా రైలు టికెట్ బుక్ చేసుకునే సమయంలో ircts వెబ్సైట్ & యాప్‌లో వివిధ రకాల యాప్స్ వస్తుంటాయి. ఈ అశ్లీల యాప్స్ ద్వారానే IRCTCకి యూజర్ కి మధ్య వింత అనుభవం ఎదురైంది. అశ్లీల యాడ్స్ ఐఆర్‌సిటిసి వెబ్ లో వస్తున్నాయని ఇది చాలా ఇబ్బందికరంగా ఉందన్న యూజర్ కి తప్పంతా నీవైపే ఉందంటూ విశ్లేషిస్తూ ట్వీట్ కి రిప్లయి ఇచ్చింది.

ఐఆర్‌సీటీసీకి ట్విట్టర్ ఖాతాకు

ఆనంద్ కుమార్ అనే యూజర్ రైలు టిక్కెట్ బుక్ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యాడు. ఆ తర్వాత టిక్కెట్ బుక్ చేస్తుండగా, అశ్లీల యాడ్స్‌తో పాటు.. మరికొన్ని వాణిజ్య ప్రకటనలు వచ్చాయి. దీంతో ఆనంద్‌కు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే వాటిని స్క్రీన్ షాట్ తీసి ఐఆర్‌సీటీసీకి ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేశారు. దీనికి కొన్ని క్షణాల్లోనే దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది ఐఆర్‌సీటీసీ.

అశ్లీల యాడ్స్, యూజర్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన IRCTC

గూగుల్ లో సెర్చ్..

ఐఆర్‌సీటీసీ ఇచ్చిన సమాధానంతో ఆనంద్ దిమ్మతిరిగిపోయింది. మీరు ప్రతి రోజు దీనికోసం ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేస్తారో వాటికి సంబందించిన యాడ్స్ కనిపిస్తాయి.ఐఆర్‌సీటీసీ ప్రకటనల కోసం గూగుల్‌కు చెందిన యాడ్ సర్వింగ్ టూల్ ADX ఉపయోగిస్తుంది. యూజర్ల బ్రౌజర్‌లోని హిస్టరీని, బ్రౌజింగ్ బిహేవియర్‌ను బట్టి యాడ్స్ కనిపిస్తాయి. అలాంటి యాడ్స్ కనిపించకూడదంటే దయచేసి మీ బ్రౌజర్‌లోని కుకీస్, హిస్టరీ డిలిట్ చేయండి" అని ఐఆర్‌సీటీసీ రైల్వే సేవ ట్విట్టర్ హ్యాండిల్‌ నుంచి రిప్లై వచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారిపోయింది.

అశ్లీల యాడ్స్, యూజర్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన IRCTC

మూడింటికి ట్యాగ్

@RailMinIndia @IRCTCofficial @PiyushGoyalOffc ఈ మూడింటికి యూజర్ ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు. మీరు ఎక్కువగా గూగుల్ లో అవే సెర్చ్ చేస్తున్నారని అందువల్లే మీకు అవి కనిపిస్తున్నాయని వెంటనే వాటిని చూడటం మానేయండననట్లుగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐఆర్‌సిటిసి ) సమాధానం ఇచ్చింది. ఐఆర్‌సీటీసీ ఇలాంటి రిప్లైతో యూజర్‌కు క్లాస్ తీసుకున్నాక ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు ఊరుకుంటారా? ఓ రేంజ్‌లో రిప్లైస్ ఇచ్చారు. సెటైర్లు, నవ్వు తెప్పించే మీమ్‌లతో ట్రోల్ చేశారు.

Best Mobiles in India

English summary
Why obscene ads on IRCTC is users' problem and not Indian Railways

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X