Home
News

OnePlus 8T 5G కొనుగోలుకు మంచి తరుణం ఇదే!! డిస్కౌంట్ ఆఫర్లు చాలానే ఉన్నాయి...

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ ప్రియులను అధికంగా ఆకట్టుకున్న వన్‌ప్లస్ బ్రాండ్ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో భారతదేశంలో ముఖ్యంగా ప్రీమియం విభాగంలో అద్భుతమైన ఘనతను సాధించింది. ఈ త్రైమాసికంలో వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ ఎక్కువగా అమ్ముడయ్యాయి. నాల్గవ త్రైమాసికంలో తాజా వన్‌ప్లస్ 8T 5Gతో ఈ బ్రాండ్ మరింత ముందుకు కొనసాగుతుందని భావిస్తున్నారు. ఇండియాలోని ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లో వన్‌ప్లస్ 8T 5G ఫోన్ అందరికంటే మెరుగ్గా ఉంది. ఇది ఫీచర్-రిచ్ కెమెరా, సూపర్-ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్‌ మరోసారి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ద్వారా ఈ పండుగ సీజన్‌లో మరింత ఆకర్షణీయమైన ఆఫర్లతో విక్రయించనున్నది.

Why OnePlus 8T 5G Tops Our List Of Best Flagship Smartphones of 2020

వన్‌ప్లస్ 8T 5G ఫ్లూయిడ్ 120Hz డిస్ప్లే

వన్‌ప్లస్ 8T 5G ఫోన్ 6.55-అంగుళాల అమోలెడ్ ఫుల్ ‌హెచ్‌డి+ డిస్‌ప్లేను 2400 x 1080 పిక్సెల్‌ రిజల్యూషన్ మరియు 120HZ రిఫ్రెష్ రేట్‌తో అందిస్తుంది. ఈ బంప్ అప్ రిఫ్రెష్ రేట్ ప్యానెల్ ప్రతిస్పందన కోసం మరింత మెరుగ్గా ఉండి ద్రవంగా చేస్తుంది. దీని యొక్క డిస్ప్లే sRGB మరియు డిస్ప్లే P3 కలర్ ప్రమాణాలకు మద్దతు ఇస్తుంది. ఇవే కాకుండా దాని నిజ జీవిత కలర్లతో వన్‌ప్లస్ 8 ప్రో డిస్ప్లే సమానంగా ఉంటుంది. వేగవంతమైన రిఫ్రెష్ రేటు గల AMOLED ప్యానెల్ సంపూర్ణంగా ఉండడమే కాకుండా ఇది తగినంత ప్రకాశవంతంగా మరియు 1100 నిట్స్ గరిష్ట ప్రకాశ స్థాయిని కలిగి ఉంటుంది.

Why OnePlus 8T 5G Tops Our List Of Best Flagship Smartphones of 2020

సూపర్-స్మూత్ రిఫ్రెష్ రేట్‌తో పాటు మెరుగైన టచ్ కోసం దాని శాంప్లింగ్ రేటును 240HZ‌కు పెంచారు. దీని యొక్క స్క్రీన్ HDR10 + సర్టిఫికేట్ మరియు సజావు గ్లైడ్ వీక్షణను అందిస్తుంది. ఇందులోని 120HZ డిస్ప్లే బట్టీ స్మూత్ డిస్‌ప్లే అనుభవాన్ని అందిస్తుంది. తద్వారా మొత్తం వీక్షణ మరియు గేమింగ్ అనుభవం రెండింటినీ మెరుగుపరుస్తుంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వన్‌ప్లస్ 8T 5G 120HZ డిస్ప్లే స్మార్ట్‌ఫోన్‌ల కోసం కొత్త ధరల వ్యూహాన్ని నిర్దేశిస్తుంది మరియు ప్రత్యర్థులతో పోలిస్తే వీటి ధరలు మరింత సరసమైనదిగా ఉన్నాయి.

Why OnePlus 8T 5G Tops Our List Of Best Flagship Smartphones of 2020

వన్‌ప్లస్ 8T 5G 65W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ

వన్‌ప్లస్ 8T 5G ఫోన్ 4500 mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లలో 65W వార్ప్ వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీని మొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. ఇది 65W ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ లో లభిస్తున్నందున ఇది బ్యాటరీని కేవలం 40 నిమిషాల్లో 0 నుండి 100% వరకు ఛార్జ్ చేస్తుంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వన్‌ప్లస్ నుండి మునుపటి ఛార్జింగ్ టెక్నాలజీల మాదిరిగా కాకుండా వార్ప్ ఛార్జ్ 65 ఛార్జర్ USB పవర్ డెలివరీ ప్రమాణానికి మద్దతు ఇస్తుంది.

వన్‌ప్లస్ 8T 5G సాఫ్ట్‌వేర్ పూర్తి వివరాలు

వన్‌ప్లస్ 8T 5G ఫోన్ యొక్క సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 11 పైన ఆక్సిజన్ OS11 ను బూట్ చేస్తుంది. వన్‌ప్లస్ కస్టమ్ రామ్ యొక్క ఈ కొత్త ఇతరేషన్ ఇప్పటికే వన్‌ప్లస్ 8 సిరీస్‌లోని ఇతర పరికరాలకు విడుదల చేయబడుతోంది. ఇది శామ్‌సంగ్ వన్ UI లో చూసిన మాదిరిగానే బోల్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. అలాగే స్టాక్ వన్‌ప్లస్ యాప్లు క్లాక్, గ్యాలరీ, సెట్టింగులను మొదలైనవి మీరు ఓపెన్ చేసినప్పుడు పెద్దవిగా ఉంటాయి. వీటిని మీరు క్రిందికి స్క్రోల్ చేసినప్పుడు సాధారణ పరిమాణానికి తిరిగి మళ్ళించబడతాయి.

Why OnePlus 8T 5G Tops Our List Of Best Flagship Smartphones of 2020

ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆక్సిజన్ ఓఎస్ 11 సరైన డార్క్ మోడ్ సెట్టింగ్‌ను కలిగి ఉంది. మీరు ఈ సెట్టింగ్‌ను షెడ్యూల్ చేయవచ్చు మరియు మీ యొక్క ఇష్టానుసారం దాన్ని ఆన్ చేసే సదుపాయం కూడా ఉంది. అలాగే ఇది మీరు ఎంచుకున్న థీమ్ నుండి స్వతంత్రంగా పని చేస్తుంది. సరైన ఆల్-ఆన్ డిస్ప్లే ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఇది మీరు పరికరాన్ని ఎన్నిసార్లు అన్‌లాక్ చేశారో చూపిస్తుంది. వన్‌ప్లస్ 8T 5Gని ఆక్సిజన్‌ఓఎస్ 11.0.2.3 కి ఇటీవలి అప్ డేట్ లో తీసుకుంటుంది. అలాగే మీరు సిస్టమ్ విద్యుత్ వినియోగంలో ఆప్టిమైజేషన్లను చూడగలుగుతారు. ఇది ఉష్ణ ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా బ్యాటరీ ఓర్పును విస్తరించడానికి ఇంటెలిజెంట్ 5G ఫీచర్‌లో ఆప్టిమైజేషన్లు, మెరుగైన సిస్టమ్ స్థిరత్వం వంటి ఇతర ఫీచర్లను కలిగి ఉంటుంది.

Why OnePlus 8T 5G Tops Our List Of Best Flagship Smartphones of 2020

48మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్

వన్‌ప్లస్ 8T 5G స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ఎడమవైపు ఎగువ మూలలో దీర్ఘచతురస్రాకార మాడ్యూల్‌లో క్వాడ్ కెమెరాలను అమర్చబడి ఉంటుంది. ఈ కెమెరా మాడ్యూల్‌లో 48MP సోనీ IMX586 సెన్సార్‌తో ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది OIS, 0.8µm పిక్సెల్-సైజు మరియు f /1.7 ఎపర్చరుతో కలిగి ఉంటుంది. క్వాడ్-కెమెరా మాడ్యూల్‌లోని ఇతర సెన్సార్లలో 16MP సోనీ IMX481 సెకండరీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 123-డిగ్రీల వీక్షణ కోణంలో మరియు 3 సెం.మీ ఫోకల్ లెంగ్త్‌తో 5MP డీప్ లెన్స్ కెమెరాను మరియు 2MP మోనోక్రోమ్ లెన్స్ కెమెరాలను ప్యాక్ చేయబడి ఉన్నాయి.

Why OnePlus 8T 5G Tops Our List Of Best Flagship Smartphones of 2020

వన్‌ప్లస్ 8T 5G ఫోన్ సేల్ ఆఫర్స్

వన్‌ప్లస్ 8T 5G ఫోన్ ను ప్రస్తుతం అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్ మరియు వన్‌ప్లస్ రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఆక్వామారిన్ గ్రీన్ మరియు లూనార్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. పండుగ సీజన్లో మరిన్ని డిస్కౌంట్ల ఆఫర్లతో దీనిని కొనుగోలు చెయవచ్చు. డిస్కౌంట్ల ఆఫర్లలో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డుల వినియోగదారులకు నో-కాస్ట్ EMI లావాదేవీలు అందుబాటులో ఉన్నాయి. అలాగే కొనుగోలు చేసిన వారికి 2,000 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. వీటితో పాటుగా జియో యూజర్లకు రూ.6,000 విలువైన కూపున్లు అదనంగా లభిస్తాయి. అలాగే ఈ ఫోన్ కొనుగోలుదారులు వన్‌ప్లస్ బుల్లెట్ వైర్‌లెస్‌ మీద 50% ఆఫ్ మరియు వన్‌ప్లస్ 8T 5G శాండ్‌స్టోన్ బంపర్ కేసు మీద 5% తగ్గింపు పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Why OnePlus 8T 5G Tops Our List Of Best Flagship Smartphones of 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X