ట్విట్టర్‌ని ఉద్యోగులు వీడడానికి కారణం..?
మైక్రో బ్లాగింగ్ వైబ్‌సైట్ అయిన ట్విట్టర్ కంపెనీకి చెందిన 700 మంది ఇంజనీర్లు, టాప్ ఎగ్జిక్యూటివ్స్ స్వస్తి పలికారు. ఇందుకు గల కారణాలను అన్వేషిస్తే ఉద్యోగులు వారియొక్క షేర్లను విక్రయించే సమయంలో ట్విట్టర్ నియంత్రణలను విధించింది. ఈ సంవత్సరంలో ట్విట్టర్ మూడవ త్రైమాసికం ముగిసే సమయానికి సుమారు $800 మిలియన్ల ఫైనాన్స్‌ని కేవలం ఉద్యోగుల ద్వారానే సొంతం చేసుకుంది. ఇందులో ఉద్యోగులు 20శాతం షేర్‌ని సోంతం చేసుకున్నారు.
గత కొంత కాలంగా ట్విట్టర్‌లో పని చేస్తున్న ఉద్యోగులు వారియొక్క షేర్లను అమ్ముకునేందుకు గాను ఇది సరైన టైమ్‌గా భావించి, ప్రయివేట్ మార్కెట్లో వారి షేర్లను పెట్టడం జరిగింది. ఐతే ఇప్పటికి కూడా ట్విట్టర్ మాజీ ఉద్యోగుల షేర్లపై తన ఆధిపత్యాన్ని చూపించడం జరుగుతుంది. వివిధ ఉద్యోగులు వారియొక్క అభిరుచులకు తగ్గట్టుగా, ట్విట్టర్ షేర్లకు మంచి రోజులు వచ్చాయని అమ్ముకోవడానికి ప్రయత్నించగా, మరికొంత మంది షేర్లను వారివద్దనే ఉంచుకునే ప్రయత్నం చేశారు.
ఐతే ప్రస్తుతం ట్విట్టర్ నుండి టాప్ ఎగ్జిక్యూటివ్స్ వైదోలుగుతున్నప్పటికీ కంపెనీకి వచ్చిన నష్టం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. కంపెనీలోకి కొత్త వారిని హైర్ చేసుకుని తన కొత్త ప్రణాళికలను సిద్దం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications








