ఐ హేట్ ఫేస్‌బుక్‌కి 'ఐదు' రీజన్స్

By Super
|
ఐ హేట్ ఫేస్‌బుక్‌కి 'ఐదు' రీజన్స్


ఫేస్‌బుక్ ప్రస్తుతం ఉన్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్‌లలో అత్యంత ప్రజాదరణ ఉన్న వెబ్‌సైట్. అసలు ఫేస్‌బుక్ ఎలా ప్రారంభమైందంటే యునైటెడ్ స్టేట్స్‌ పాఠశాలలో కొత్త సంవత్సరంలో విద్యార్దులు చేరినప్పుడు, వారి ఫోటోలు, పూర్తి వివరాలతో కూడిన ఓ పుస్తకాన్ని రూపొందిస్తారు. దీనిని ఆధారంగా చేసుకోని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జూకర్స్ బర్గ్ ఫేస్‌బుక్‌ని రూపొందించడం జరిగింది. ఐతే ఇటీవల కాలంలో ఫేస్‌బుక్ కొంత అప్రతిష్టని మూటగట్టుకుంది.

 

ఆ అప్రతిష్ట ఏమిటంటే ఇందులోని యూజర్ల అకౌంట్‌ వివిధ దేశాల ప్రభుత్వాలు, ప్రయివేటు సంస్థలు ఇతరత్రాగా ఉపయోగించుకునే అవకాశం ఉందనే వాదనలు, అనుమానాలు అనేకం ఉన్నాయి. అంతేకాదండోయ్ ఇటీవల కాలంలో సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్స్‌ని వినియోగదారులు అసహ్యించుకునేందుకు గల కారణాలు ఏంటనేది చూద్దాం.

1. సమయం వృధా: ఫేస్‌బుక్‌‌లో ఎకౌంట్ ఓపెన్ చేస్తే, ఆ యూజర్‌కు ఎంత మంది ఫ్రెండ్స్‌ ఉన్నారు, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ఏ స్థాయిలో ఉంది లాంటి అంశాలతో పాపులారిటీ నమోదవుతుంటుంది. ఎంతమందితో ఆ యూజర్‌ కనెక్ట్‌ అయ్యాడనే విషయాన్ని ఈ పాపులారిటీ తెలియజేస్తుంది. దీనివల్ల ఎక్కువ సమయం వృధా అవుతుంది.

2. ఫోటోలు: సామాజిక వెబ్‌సైటైన ఫేస్‌బుక్‌లో ఎక్కువ మంది యూజర్స్ కొత్తగా అప్‌లోడ్ చేసిన ఫోటోలను చూస్తుంటారు. ఈ ఫోటోలను కొంత మంది యూజర్స్ వేరే వాటికి ఉపయోగించుకునే అవకాశం ఉంది.

3. ఎక్కువ మందివి ఫేక్ ఎకౌంట్లు: సమాజంలో ఉన్న వ్యక్తులతో ఈజీగా కలసి పోయేందుకు ఫేస్‌బుక్‌ని ఇటీవల కాలంలో ఎక్కువగా యువత ఉపోయోగిస్తున్నారు. ముఖ్యంగా మనం గమనించినట్లేతే.. ఒకరంటే ఒకరికి పడని ఇద్దరు వ్యక్తులలో మన స్నేహితులుంటే వారిద్దరినీ మనం యాడ్ చేసుకుంటే వీరి విషయాలు అతనికి, అతని విషయాలు వారికి తెలిసిపోతాయి. ఇలాంటి వాటిని నివారించేందుకు కొన్ని రకాల ఏర్పాట్లు ఉన్నప్పటికీ వాటిని బ్రేక్‌ చేయడం సులభమేనని ఇటీవల పలు వార్తలు వచ్చాయి.

4. అధికంగా రిక్వెస్టులు: మనకు తెలిసిన వారి నుంచి, అసలే మాత్రం తెలియని వారి నుంచి కూడా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు ఎక్కువగా వస్తుంటాయి. ఆ రిక్వెస్ట్‌ల బారి నుంచి తప్పించుకోవడం కష్టమే. అలాగని యాక్సెప్ట్‌ చేస్తే మన పని అయిపోయినట్లే.

5. ప్రెండ్స్ సజేషన్స్: మనకు ఎవరెవరు స్నేహితులయ్యే అవకాశం ఉందో సూచిస్తూ ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ సజె షన్స్‌ ఇస్తుంటుంది. ఇందులో మంచీ, చెడూ రెండూ ఉంటాయి. ఫ్రెండ్‌, ఫ్రెండ్‌ మన కూ ఫ్రెండ్‌ కావాలనే రూల్‌ ఏమీ లేదు. ఇలాంటి ఎన్నో కొత్త కొత్త విషయాలు రోజు రోజుకీ పెరిగి పోతుండడమే వినియోగదారులు అసహ్యించుకునేలా తయారవుతున్నాయని తెలిపారు. ఇవన్నీ తెలుసుకునే కాబోలు అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా తన కూతుర్లను ఇద్దరినీ ఫేస్‌బుక్ వాడోద్దని సూచించాడు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X