జియో బ్రాడ్‌బ్యాండ్ కొన్ని సార్లు ఉచితంగా ఎందుకు ఉంటుంది ?
దేశీయ టెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో అదే ఊపులో బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే మొదటి మూడు నెలలు జియోఫైబర్ నెట్ వాడేవారి నుంచి జియో ఎటువంటి ఛార్జీలు వసూలు చేయడం లేదు. దీనికి కారణం ఏంటనేది చాలామందికి తెలియదు. అయితే జియో పైబర్ నెట్ చార్జీలు వసూలు చేయకపోవడానికి ప్రధాన కారణం బిల్లింగ్ సిస్టం ఇంకా పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి రాకపోవడమేనని తెలుస్తోంది. ఇది ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. అందుకని జియో ఇంకో నెల ఉచితంగా పొడిగింపును అందిస్తోంది. దీంతో పాటుగా జియో సేల్స్ మార్కెటింగ్ టీం ముందుగా వీలయినంతవరకు జియో బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లకు కస్లమర్లను చేర్చుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అందువల్ల బిల్లింగ్ ప్రాసెస్ లేట్ అవుతోందని తెలుస్తోంది. బిల్లింగ్ ప్రాసెస్ మొదలైతే ఉచితం అనేది ఉండదని టెక్ వర్గాలు అంటున్నాయి.

జియో పైబర్ ప్లాన్స్
జియో ఫైబర్ ప్లాన్స్ రూ. 699 నుండి ప్రారంభం అవుతున్నాయి. అలాగే రూ. 8499 వరకు అందుబాటులో ఉన్నాయి. స్పీడు విషయానికి వస్తే 100 ఎంబిపిఎస్ నుంచి 1జిబిపిఎస్ వరకు అందుబాటులో ఉంది. దీంతో పాటుగా gaming, home network sharing, TV video calling & conferencing, device security వంటి ఫీచర్లను కూడా అందిస్తోంది.

లాంచ్ అయినా అమల్లోకి రాలేదు
కాగా జియో బ్రాడ్ బ్యాండ్ సేవలు లాంచ్ అయినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి రాలేదు. నెల రోజులయినప్పటికీ ఇంకా బిల్లింగ్ అనేది ప్రారంభ దశలోనే ఉంది.సెప్టెంబర్ 5 లాంచింగ్ తర్వాత 5 లక్షల యూజర్లు జియో పైబర్ ట్రయిల్స్ ని వాడుతున్నారు. వీరికి ఇంకా ఉచితంగానే సేవలు లభిస్తున్నాయి.

సెక్యూరిటీ డిపాజిట్
ఇప్పడు జియో ఫైబర్ బుక్ చేసుకున్న వారికి ఇంకా కనెక్షన్ అందుబాటులో లేదు. వారు సెక్యూరిటీ డిపాజిట్ చేసినప్పటికీ బిల్లింగ్ సెక్షన్ అనేది ఇంకా సందిగ్ధంలోనే ఉంది. మొబైల్ బిల్లింగ్ సిస్టంనే ఇంకా వాడుతున్నారని, పైబర్ బ్రాడ్ బ్యాండ్ ఇంకా అందుబాటులోకి రాలేదని జియో అనధికార వర్గాలు చెబుతున్నాయి.

తగ్గుతున్న యావరేజ్ రెవిన్యూ
గత రెండు సంవత్సరాల నుంచి జియో వాడుతున్న యూజర్లకు ఇంకా ఉచితంగానే దాన్ని వాడుకుంటున్నారు. జియో నుంచి ఎవరూ వారిని సంప్రదించలేదు. 100జిబి డేటాను కంటిన్యూగా వాడుతున్నామని జియో ఫైబర్ లాంచ్ అయిన తరువాత కూడా ఇదే కొనసాగుతోందని జియో నుంచి ఎగ్జిక్యూటివ్ ఎవరూ మా దగ్గరకు రాలేదని జియో వాడుతున్న ఓ యూజర్ తెలిపారు. నెలకు అదనంగా 40జిబి డేటా అదనంగా వాడుకునేందుకు మాత్రమే రీఛార్జ్ చేసుకుంటున్నానని తెలిపారు. కాగా గత ఏడు క్వార్టర్ల నుంచి యావరేజ్ రెవిన్యూ యూజర్ తగ్గుతూ వస్తున్నారు.

8.4 మిలియన్లమంది కొత్త ఖాతాదారులు
ఇదిలా ఉంటే రిలయన్స్ జియో మరోమారు సత్తా చాటింది. ఆగస్టు నెలలో 8.4 మిలియన్లమంది కొత్త ఖాతాదారులను చేర్చుకుంది. దీంతో జియో మొత్తం ఖాతాదారుల సంఖ్య 348 మిలియన్లనకు చేరుకుంది. అదే సమయంలో మరో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ 5 లక్షల మందికిపైగా ఖాతాదారులను కోల్పోయింది. దీంతో దాని ఖాతాదారుల సంఖ్య 327 మిలియన్లకు పడిపోయింది. ఆగస్టులో వొడాఫోన్ ఐడియా 4.9 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. ఫలితంగా దాని ఖాతాదారుల బేస్ 375 మిలియన్లకు తగ్గింది.

ఇతర నెట్ వర్క్ యూజర్లు
ఆగస్టు చివరి నాటికి భారతీ ఎయిర్‌టెల్ మొత్తం వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లలో93.36 శాతం యాక్టివ్ వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు(వీఎల్ఆర్) ఉండగా, వొడాఫోన్ ఐడియా క్రియాశీలక ఖాతాదారుల బేస్ 82.23 శాతంగా, జియో యాక్టివ్ యూజర్ల బేస్ 83.11శాతంగా నమోదైంది. మొత్తం వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 117.1 కోట్లు కాగా, ఆగస్టులో బీఎస్ఎన్ఎల్ 2 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. దీంతో దాని ఖాతాదారుల సంఖ్య 11.62 కోట్లకు పడిపోయింది.


Click it and Unblock the Notifications








