శాంసంగ్‌కు శుభవార్త, షియోమకి బ్యాడ్ న్యూస్

దేశీయ ఈ కామర్స్‌ రంగంలో భారీ పెట్టుబడులతో దూసుకొస్తున్న విదేశీ కంపెనీలకు షాకిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

|

దేశీయ ఈ కామర్స్‌ రంగంలో భారీ పెట్టుబడులతో దూసుకొస్తున్న విదేశీ కంపెనీలకు షాకిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కామర్స్‌ నిబంధనలను కఠినతరం చేస్తూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో మార్పులను తీసుకొచ్చింది. ఈ నిర్ణయం దేశీయ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో మేజర్‌ వాటాను సొంతం చేసుకున్న వాల్‌మార్ట్‌కు, అమెరికా ఆన్‌లైన్‌ రీటైలర్‌ అమెజాన్‌కు భారీ షాక్‌ ఇచ్చింది. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా భారీ ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఈ కంపెనీలకు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి. అలాగే పండుగ సీజన్‌లో తక్కువ ధరకే వస్తువులను సొంతం చేసుకోవాలను కునే వినియోగదారుడికి భారీ నిరాశే మిగలనుంది.శాంసంగ్ కి ఈ న్యూస్ కొంచెం ఊరటని అలాగే షియోమికి బ్యాడ్ గానూ ఉండనుంది.

మీ ఆధార్ కార్డు పోయిందా..అయితే ఇలా చేయండిమీ ఆధార్ కార్డు పోయిందా..అయితే ఇలా చేయండి

సవరించిన కొత్త విధానంపై

సవరించిన కొత్త విధానంపై

చిన్న వ్యాపారస్తుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ఆన్‌లైన్ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి సవరించిన కొత్త విధానంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

 

ఈ-కామర్స్ సంస్థల తీవ్ర పోటీ

ఈ-కామర్స్ సంస్థల తీవ్ర పోటీ

పుష్కలంగా నిధులున్న ఈ-కామర్స్ సంస్థల తీవ్ర పోటీ నుంచి దేశీ వ్యాపార సంస్థల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఈ నిబంధనలు రూపొందించినట్లు వివరించింది. తాజా నిబంధనలు ఫిబ్రవరి 1నుంచి అమల్లోకి రానున్నాయి.

సొంత పోర్టల్స్‌లో

సొంత పోర్టల్స్‌లో

తమకు వాటాలున్న కంపెనీల ఉత్పత్తులను ఈ-కామర్స్ సంస్థలు తమ సొంత పోర్టల్స్‌లో విక్రయించడం కుదరదు. ధరను ప్రభావితం చేసేలా ఏ ఉత్పత్తులను ఎక్స్‌క్లూజివ్‌గా తమ పోర్టల్స్‌లోనే విక్రయించేలా ఈ-కామర్స్ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకోకూడదు.

పక్షపాతం, వివక్ష

పక్షపాతం, వివక్ష

తమ షాపింగ్‌ పోర్టల్స్‌లో విక్రయించే విక్రేతలకు సర్వీసులు అందించడంలో ఈ-కామర్స్ సంస్థలు పక్షపాతం, వివక్ష చూపించకూడదు. లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌, అడ్వర్టైజ్‌మెంట్‌, మార్కెటింగ్‌, పేమెంట్స్‌, ఫైనాన్సింగ్ మొదలైన సర్వీసులు ఇందులో ఉంటాయి.

క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్ల విషయంలో

క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్ల విషయంలో

ఈ-కామర్స్‌ సంస్థకు చెందిన గ్రూప్ కంపెనీలు.. కొనుగోలుదారులకు అందించే క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్ల విషయంలో న్యాయబద్ధంగా, వివక్ష లేకుండా వ్యవహరించాల్సి ఉంటుంది. తమ దగ్గరున్ననిల్వల్లో 25శాతం ఉత్పత్తులకు మించి విక్రయించరాదు.

ఆడిట్‌ సర్టిఫికెట్‌

ఆడిట్‌ సర్టిఫికెట్‌

నిబంధనలన్నింటినీ పాటిస్తున్నట్లుగా ప్రతి ఆర్థిక సంవత్సరం ఆడిట్‌ సర్టిఫికెట్‌ను ఈ- కామర్స్ కంపెనీలు ఆ పై ఏడాది సెప్టెంబర్ 30లోగా రిజర్వ్ బ్యాంక్‌కు సమర్పించాల్సి ఉంటుంది

Best Mobiles in India

English summary
Why the new e-commerce norms are ‘good news’ for Samsung and ‘bad’ for Xiaomi.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X