కీలక పరిణామం.. భారత్‌లో టిక్‌టాక్ మాతృసంస్థ ఉద్యోగ ప్రకటన..!
ప్రముఖ షార్ట్ వీడియో ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌ను గతంలో భారత్- చైనా సరిహద్దు ఘర్షణల అనంతరం భద్రతా కారణాలతో కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. సుమారు ఐదు సంవత్సరాలుగా టిక్‌టాక్‌పై నిషేధం కొనసాగుతోంది. యాప్ ప్రస్తుతం ఎవరికీ అందుబాటులోకి లేదు. అయితే ఇటీవల కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో టిక్‌టాక్ (TikTok) భారత్‌లో మళ్లీ ఎంట్రీ ఇవ్వనుందా అనే చర్చ ప్రారంభం అయింది.
ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలే ఈ చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి. 2020 సంవత్సరంలో భారత్, చైనా సరిహద్దులో గల్వాన్ లోయ వద్ద భారీ స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఇరు దేశాల్లో ప్రాణనష్టం కూడా జరిగింది. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం భద్రతా కారణాలతో చైనాకు చెందిన టిక్‌టాక్ సహా అనేక యాప్‌లపై నిషేధం విధించింది.

సుమారుగా గత ఐదేళ్లుగా టిక్‌టాక్‌పై బ్యాన్ కొనసాగుతోంది. అయితే ఇటీవల భారత్, చైనా మధ్య పరిస్థితులు కొంత అనుకూలంగా మారుతున్నారు. భారత్‌పై అమెరికా సుంకాల విధింపుపై ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భారత్ మద్దతుగా నిలిచాయి. ఈ జాబితాలో చైనా కూడా ఉంది.
ఇరు దేశాల మధ్య సానుకూల పరిస్థితుల నేపథ్యంలో టిక్‌టాక్ పై నిషేధం ఎత్తివేసే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. ఇటీవలే ఈ టిక్‌టాక్ వెబ్‌సైట్ కొంతమందికి అందుబాటులోకి వచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే యాప్ మాత్రం నిషేధం అనంతరం అందుబాటులోకి రాలేదు.
గతంలోనే స్పందించిన ప్రభుత్వం! :
దీనిపై గత వారమే భారత ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. టిక్‌టాక్‌పై ఇప్పటికీ నిషేధం కొనసాగుతోందని స్పష్టం చేశాయి. గూగుల్, ఆపిల్ ప్లేస్టోర్‌లో యాప్ అందుబాటులో లేదు. అయితే తాజాగా జరిగిన పరిణామం కొత్త చర్చకు అవకాశం ఇచ్చింది.
తాజాగా ఏం జరిగింది :
టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ (Byte Dance) భారత్‌లో ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేసేందుకు వీలుగా లింక్డిన్ లో ఈ నోటిఫికేషన్ కనిపించింది. కంటెంట్ మోడరేటర్ (బెంగాలీ స్పీకర్), వెల్‌బీయింగ్ పార్టనర్‌షిప్ అండ్ ఆపరేషన్స్ లీడ్- ట్రస్ట్ అండ్ సేఫ్టీ విభాగాల్లో దరఖాస్తులను ఆహ్వానించింది.

ఇదే కారణమా :
ఈ ప్రకటన నేపథ్యంలో భారత్‌లో మళ్లీ టిక్‌టాక్ అందుబాటులోకి రానుందా అనే వార్తలు ఊపందుకున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొనే ఈ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు కొంత మంది చెబుతున్నారు. ఇప్పటి వరకు టిక్‌టాక్ ఈ ఊహాగానాలపై ఎటువంటి ప్రకటన చేయలేదు.
కోట్లాది మంది యూజర్లు :
2020 జూన్ నాటికి భారత్‌లో టిక్‌టాక్ యాప్‌కు కోట్లాది మంది యూజర్ల ఉండేవారు. బ్యాన్ అనంతరం టిక్‌టాక్ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం బైట్‌డ్యాన్స్ కు చెందిన కొంత మంది ఉద్యోగులు మాత్రమే భారత్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
2020 లో టిక్‌టాక్‌తోపాటు షేర్ ఇట్, యూసీ బ్రౌజర్, బైడూ మ్యాప్ వంటి అనేక యాప్స్ ఉన్నాయి. ఇప్పటికీ చాలా యాప్స్ పై నిషేధం కొనసాగుతోంది. ఈ యాప్స్ పై నిషేధం ఎత్తివేతపై ఎటువంటి అధికారిక సమాచారం అందుబాటులోకి రాలేదు.


Click it and Unblock the Notifications








