రాత్రి పూట స్మార్ట్‌ఫోన్లు వాడితే ఈ ప్రమాదం తప్పదు..
ఈ రొజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్ర పోయే వరకు దీని మీదనే గడిపేస్తుంటారు..
ఈ రొజుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్ర పోయే వరకు దీని మీదనే గడిపేస్తుంటారు.. అయితే చాలామంది ఎక్కువగా ఫోన్లను రాత్రి పూట వాడుతారని తెలిసిన విషయమే...అయితే ఇలా వాడటం చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు.

బ్లూ లైట్ వల్ల..
ఫోన్ లో ఎక్కువగా బ్లూ లైట్ కనిపిస్తుంది. ఈ బ్లూ లైట్ వల్ల కంటికి ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. రాత్రి పూట నిద్రపోవడానికి ముఖ్యoగా శరీరంలో విడుదలయ్యే మెలటోనిన్ అనే హార్మోన్ ఈ బ్లూ లైట్ భారీన పడుతుందని వారంటున్నారు.

మెలటోనిన్ విడుదలను..
ఈ హార్మోన్ సాయంత్రం నుంచి శరీరంలో మెల్ల మెల్లగా విడుదల అవుతుంది. సాయంత్రానికి అది పూర్తి స్థాయిగా అవతరించే సమయంలో బ్లూ లైట్ మెలటోనిన్ విడుదలను పూర్తిగా తగ్గిస్తుందని తద్వారా నిద్రలేమి సమస్యలు వస్తాయని వారంటున్నారు.

ఒక వేళ వాడితే..
కావున రాత్రి సమయంలో ఫోన్ వాడకూడదట..ఒక వేళ వాడితే దాని నుంచి వచ్చే బ్లూ లైట్‌ని ఆటోమేటిక్ నియంత్రించేలా సెట్ చేసుకోవాలని చెబుతున్నారు.

గంట ముందు..
నిద్రకు ఉపక్రమించే గంట ముందు స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్ దూరంగా వుండటం ద్వారా కంటికి, మెదడుకు విశ్రాంతి ఇచ్చినవారమవుతామని వైద్యులు కూడా సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications








