వైఫై 6 గురించి కొన్ని నిజాలే వింటే ఆశ్చర్యపోతారు

వైఫై చాలా ఫాస్టుగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఇంటర్నెట్ చాలా స్పీడుగా వర్క్ కావడానికి వైఫై అనేది చాలా కీలకం. అన్ని రకాల డివైస్ లకు ఇంటర్నెట్ కేబుల్ కనెక్షన్ ఇవ్వలేని పక్షంలో అందరూ ముందుగా చూసేది

|

వైఫై చాలా ఫాస్టుగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఇంటర్నెట్ చాలా స్పీడుగా వర్క్ కావడానికి వైఫై అనేది చాలా కీలకం. అన్ని రకాల డివైస్ లకు ఇంటర్నెట్ కేబుల్ కనెక్షన్ ఇవ్వలేని పక్షంలో అందరూ ముందుగా చూసేది వైఫై వైపే అన్నది పచ్చి నిజం. మన యొక్క ల్యాపీలకు, మొబైల్స్ కు apps, games, and videos రన్ కావాలంటే వైఫై అనేది అత్యవసరం కూడా. అయితే వైఫై కూడా సరికొత్త టెక్నాలజీ వైపు దూసుకెళుతోంది.ఇందులో భాగంగా వైఫై 6 త్వరలో దూసుకొస్తోంది. దీని స్పీడు అపరిమితమే కాకుండా ఇంకా ఎన్నో రకాల ఉపయోగాలను అందిస్తోంది.అవేంటి, అసలు వైఫై 6 పనితీరు ఎలా ఉంటుందో ఓ సారి చూద్దాం.

వైఫై 6 గురించి కొన్ని నిజాలే వింటే ఆశ్చర్యపోతారు

వైఫై6 అంటే ఏమిటి

వైఫై6 అంటే ఏమిటి

Wi-Fi 6 అనేది తరువాతి తరానికి సంబంధించిన వైఫై. ఇంతకు ముందు లాగానే ఇంటర్నెట్ కి కనెక్ట్ అయి ఉంటుంది. కాకుంటే కొన్ని అదనపు టెక్నాలజీలతో స్పీడ్ ప్రాసెస్ తో వచ్చే తరం వైఫై రానుంది.

ఫాస్ట్ ఎలా ఉంటుంది

ఫాస్ట్ ఎలా ఉంటుంది

దీని స్పీడు విషయానికి వస్తే 9.6 Gbpsతో రానుంది. ఇప్పుడు ఉన్న వైఫై 5 కేవలం 3.5 Gbps స్పీడును మాత్రమే అందిస్తోంది.ఇది కేవలం ఒక్క డివైస్ కి అందే స్పీడు కాదు. అన్ని రకాల డివైస్ లకు ఈ స్పీడు అందుతుంది. డౌన్లోడ్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది.

టాప్ స్పీడ్

టాప్ స్పీడ్

కాగా రానున్న ఈ వైఫై 6 అన్ని రకాల గాడ్జెట్లకు సపోర్ట్ చేసే విధంగా రానుంది. కాగా వైఫై 5లో కేవలం 5 రకాల డివైస్ లకు మాత్రమే యావరేజ్ స్పీడ్ ఉంటుంది. కాని వైఫై 6లో 9 డివైస్ ల వరకు యావరేజ్ స్పీడు ఉంటుంది.

స్పీడ్ తగ్గుతుందా ?

స్పీడ్ తగ్గుతుందా ?

వైఫై 5 లో పోలిస్తే అనేక రెట్టు ఎక్కువగా వైఫై 6 వస్తోంది. దీని స్పీడ్ కూడా చాలా వేగవంతం కాబట్టి స్లో అయ్యేదానికి అవకాశం లేదు. దీనికి పాత దానిలాగే రూటర్ అవసరం ఉంటుంది.

బ్యాటరీ బ్యాకప్

బ్యాటరీ బ్యాకప్

రానున్న వైఫై 6 ద్వారా బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. డివైస్ లు స్లో కావడం కాని బ్యాటరీ ఛార్జింగ్ అయిపోవడం కాని జరగదు. మినిమం స్పీడుతోనే అన్ని రకాల గాడ్జెట్లను ఆపరేట్ చేసుకునే విధంగా ఇది రానుంది.

 

 

Best Mobiles in India

English summary
Wi-Fi 6: is it really that much faster?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X