Wi-Fi గురించి మీకు ఎంత వరకు తెలుసు..?

Wi-Fi కనెక్టువిటీ ద్వారా స్మార్ట్‌ఫోన్‌‌లలో సమాచారాన్ని ఇంటర్నెట్ ను ఆస్వాదించగలుగుతున్నాం. స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న చాలామందికి బ్లూటూత్, వై-ఫైల గురించి పెద్దగా అవగాహన లేదనేది వాస్తవం. రెండు డివైజ్‌ల మధ్య నిర్ణీత దూరం వరకు వైర్లసాయం లేకుండా సమాచారాన్ని షేర్ చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని 'బ్లూటూత్'గా వ్యవహరించుకుంటున్నాం.

 Wi-Fi గురించి మీకు ఎంత వరకు తెలుసు..?

Read More : సామ్‌సంగ్‌కు షాకిచ్చిన చిన్న బ్రాండ్‌లు!

బ్లూటూత్ వ్యవస్థ అనేది పరిమిత స్థాయిలో పరిమిత వ్యక్తుల అనుమతితో పరిమిత పరిధిలో పని చేస్తుంది. ఇక వై-ఫై విషయానికొస్తే ఈ వ్యవస్థ సామర్థ్యాన్ని బట్టి చేరువలో ఉన్న ఎన్ని పరికరాలనైనా కనెక్ట్ చేసుకోవచ్చు. వై-ఫై పద్థతిలో పరికరాల మధ్య సమాచారన్ని మరింత వేగవంతంగా షేర్ చేసుకోవచ్చు. వై-ఫై కనెక్టువిటీ గురించి పలు ఆసక్తిర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వై-ఫై పూర్తి పేరు

వై-ఫై పూర్తి పేరు వైర్‌లెస్ ఫిడిలిటీ. వై-ఫై టెక్నాలజీ రూపకల్పనకు అవసరమైన సాంకేతికతను హెడీ లామర్ర్ అనే వ్యక్తి కనుగొన్నారు.

ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేస్తుంది

వై-ఫై అనేది కనిపించిన తాడు లాంటింది. ఈ వ్యవస్థ మీ కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌ను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేస్తుంది.

అన్ని చోట్లా ఉచితంగా...

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రముఖ హోటల్స్ ఉచిత వై-ఫైను అందిస్తున్నాయి. పబ్లిక్ ప్రాంతాల్లో సైతం ఉచిత వై-ఫై అందుబాటులో ఉంది.

రేడియో సిగ్నల్స్ ఆధారంగా

వై-ఫై రేడియో సిగ్నల్స్ ఆధారంగా స్పందిస్తుంది.భవిష్యత్‌లో వైఫై కన్నా వంద రెట్లు వేగంగా స్పందించగలిగే లై-ఫై టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానుంది.

 

 

సెక్యూరిటీ కోడ్ నిబంధన లేనట్లయితే

వై-ఫై పరిధిలో సెక్యూరిటీ కోడ్ నిబంధన లేనట్లయితే ఏ వై-పై ఆధారిత పరికరమైనా ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు.

ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంతవరకు..?

వై-ఫై వ్యవస్థలో 2.4గిగాహెట్జ్ నుంచి 5గిగాహెట్జ్ వరకు ఫ్రీక్వెన్సీ రేంజ్ గల రేడియో తరంగాలను వినియోగిస్తారు.

ఒక ప్రాంగణంలోని ఇంటర్నెట్ సర్వర్‌ను

వై-ఫై కనెక్టువిటీ ద్వాారా ఒక ప్రాంగణంలోని ఇంటర్నెట్ సర్వర్‌ను ఆ క్యాంపస్‌లోని కంప్యూటింగ్ అలానే స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌లకు కనెక్ట్ అయ్యేలా చేసుకోవచ్చు.

వైఫైకు ధీటుగా లైఫై

 వైఫైకు దీటుగా లైఫై టెక్నాలజీ త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. పలు పరిశోధనల అనంతరం 224 గిగాబైట్స్ వేగంతో ఈ లైపై టెక్నాలజీ కమ్యూనికేషన్ ప్రపంచానికి పరిచయం కాబోతోంది. కార్యాలయాలు, పారిశ్రామిక వాతావరణంలో శాస్త్రవేత్తలు లైఫై పై పరీక్షలు నిర్వహిస్తున్నారు.

100 రెట్లు వేగంగా

ఎల్ఈడీ లైట్ల కాంతి తరంగాలతో ఈ కొత్త వ్యవస్థ పనిచేస్తుంది. విజిబుల్ లైట్ కమ్యూనికేషన్' తో పనిచేసే కొత్త లైఫై, వై-ఫైతో పోలిస్తే 100 రెట్లు వేగంగా ఉంటుందంటున్నారు నిపుణులు.

లై-ఫై టెక్నాలజీని

లై-ఫై టెక్నాలజీని ఇప్పటికే  కొన్ని ప్రంతాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించి చూసారు. 

400 నుంచి 800 టెరాహెడ్జ్ స్పీడ్‌తో

లై-ఫై వైర్‌లెస్ వ్యవస్థలో 400 నుంచి 800 టెరాహెడ్జ్ స్పీడ్‌తో కాంతి డేటాను బదిలీ చేస్తుంది.

హెరాల్డ్ హాస్

స్కాట్‌ల్యాండ్ ఎడిన్‌బర్గ్ విశ్వ‌విద్యాలయానికి చెందిన హెరాల్డ్ హాస్ 2011‌లో లైఫైని కనుగొన్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Wi-Fi Facts You Probably Did Not Know. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot