సెల్‌ఫోన్ పాస్‌వర్డ్ చెప్పనందుకు భర్తను తగలపెట్టిన భార్య
సెల్‌ఫోన్ చేతిలో వుంటే చాలు ప్రపంచం చేతిలో ఉన్నట్లే.సాంకేతిక విప్లవంగా గుర్తింపు పొందిన సెల్‌ఫోన్ నేడు నిత్యావసర వస్తువుగా మారింది. మనిషి దైనందిన జీవితంలో మొబైల్ ఫోన్ ఒక భాగమైంది.
సెల్‌ఫోన్ చేతిలో వుంటే చాలు ప్రపంచం చేతిలో ఉన్నట్లే.సాంకేతిక విప్లవంగా గుర్తింపు పొందిన సెల్‌ఫోన్ నేడు నిత్యావసర వస్తువుగా మారింది. మనిషి దైనందిన జీవితంలో మొబైల్ ఫోన్ ఒక భాగమైంది.కొంత మందికి సెల్‌ఫోన్ చేతిలో లేకపోతే ఏదో కోల్పోయినట్లు ఫీలవుతారు. సెల్‌ఫోన్ తయారీ సంస్థలు, నెట్‌వర్క్ సంస్థలు విరివిగా ఆఫర్‌లు ప్రకటించడంతో సెల్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.సెల్‌ఫోన్‌ల రాకతో మానవ సంబంధాలు దూరమవుతున్నాయంటే అతిశయోక్తి కాదు.ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి చేసుకుంది.సెల్‌ఫోన్ పాస్ వర్డ్ చెప్పనందుకు భర్తనే తగలబెట్టేసింది ఓ భార్య.ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే

Dedi Purnama అనే 26 ఏళ్ళ కుర్రాడు...
Dedi Purnama అనే 26 ఏళ్ళ కుర్రాడు ఇండోనేషియాలో రూఫ్ టైల్స్ ను రిపేర్ చేస్తూ జీవనం సాగించేవాడు.అతనికి భార్య కూడా ఉంది తన పేరు Ilham Cahyani.

సెల్‌ఫోన్ పాస్ వర్డ్ చెప్పమంటు కోరింది...
రెండు రోజుల క్రితం Ilham Cahyani తన భర్త ను సెల్‌ఫోన్ పాస్ వర్డ్ చెప్పమంటు కోరింది.అయితే ఎంతకీ పాస్ వర్డ్ చెప్పకపోవడంతో గొడవకు దిగింది.గొడవ పెద్దగా అవ్వడంతో Dedi Purnama తన భార్య ను గట్టిగ ఒక దెబ్బ వేసాడు.కోపంతో ఊగిపోయిన భార్య వెంటనే తన పక్కన ఉన్న పెట్రోల్ క్యాన్ ను తీసుకొని భర్త పై పోసి నిప్పంటించింది.

తన ప్రాణాలను కాపాడుకోవడనికి....
తన ప్రాణాలను కాపాడుకోవడనికి Dedi Purnama ఇంట్లో నుంచి బయటికి పారిపోయాడు.అతన్ని చూసిన కొందరు మంటలు ఆర్పీ Keruak హెల్త్ సెంటర్ తరలించారు.

రెండు రోజుల చికిత్స అనంతరం మృతి చెందాడు...
భయంకరమైన గాయాలతో హాస్పిటల్ లో చేరిన Dedi Purnama రెండు రోజుల చికిత్స అనంతరం మృతి చెందాడు.

పోలీసులు Cahyani ని అరెస్ట్ చేసి....
పోలీసులు Cahyani ని అరెస్ట్ చేసి East Lombok Regional Police Station కి తరలించారు.ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని పోలీసులు తెలిపారు.


Click it and Unblock the Notifications








