ప్రాంతీయ భాషల అభివృద్ది కొసం వీకిపిడియా ఆఫీసు ఇండియాలో

Posted By: Super

ప్రాంతీయ భాషల అభివృద్ది కొసం వీకిపిడియా ఆఫీసు ఇండియాలో

వీకిపిడియా ప్రపంచంలో ఉన్న కొట్ల జనాభాకి జ్ఞానాన్ని అందిందిస్తున్న భాండాగారం. ఇప్పటి వరకు అమెరికాలో ఉన్న వీకిపిడియా మొట్టమొదటి సారి ఇండియాలోని న్యూఢిల్లీలో కొత్త ఆఫీసుని ప్రారంభించడానికి ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని అమెరికా ప్రముఖ పత్రిక బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. బ్లూమ్‌బెర్గ్ అందించిన సమాచారం ప్రకారం ఇండియాలో వీకిపిడియా తన కొత్త ఆఫీసుని ప్రారంభించడానికి కారణం ఇండియాలో ఉన్న ప్రాంతీయ భాషలలో ఎక్కవ ఆర్టికల్స్‌ని ప్రచురించి, ఆన్ లైన్‌లో లోకల్ భాషలకు ప్రాచుర్యం కల్పించాలనేది తమ ద్యేయంగా అన్నట్లు సమాచారం.

ఇండియాలో వీకిపిడియా ఇటీవల కొత్తగా 20 ప్రాంతీయ భాషలను ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇండియా యొక్క జాతీయ భాష అయినటువంటి హిందీలో ఇటీవల 1,00,000 ఆర్టికల్స్ మైలురాయిని దాటినందుకు గాను ఇండియన్ కంట్రిబ్యూటర్స్‌ని వీకిపిడియా ప్రోత్సహించింది. వీకిపిడియా ఇండియాలో తన ఆపరేషన్స్‌ని కొనసాగించేందుకు గాను కేరళకు చెందిన 'సిజు అలెక్స్‌' అనే వ్యక్తిని కన్సల్టెంట్‌గా నియమించింది.

2005వ సంవత్సరం నుండి మొదలుకొని సిజు అలెక్స్ ఇప్పటి వరకు వీకిపిడియాకు సుమారు 500 నుండి 20,000వరకు ఆర్టికల్స్‌ని అందివ్వడం జరిగింది. ఒకానోక సందర్బంలో వీకిపిడియా సృష్టికర్త జిమ్మీ వేల్స్ ఇంటర్యూలో మాట్లాడతూ ఇండియాలో వీకిపిడియా ఆపరేషన్స్ ప్రారంభించడం అనేది కంపెనీ సాధించిన గొప్ప విజయాలలో ఒకటిగా ప్రస్తావించారు. రాబోయే కాలంలో వీకిపిడియా ప్రాంతీయ భాషలకు చక్కగా ఉపయోగపడుతుందని జిమ్మీవేల్స్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

వీకిపిడియాని ప్రారంభించిన తర్వాత 2009వ సంవత్సరంలో 340 మిలియన్ రీడర్స్ ఉండగా, ఇప్పుడు ఇండియాలో ప్రతిరోజూ రీడర్స్ సంఖ్య 420 మిలియన్లకు చేరుకుంది. ప్రాంతీయ భాషలలో వీకిపిడియాని ప్రారంభించేందుకు గాను రీడర్స్ కూడా తమవంతు సహాయాన్ని అందించారని జిమ్మీ వేల్స్ గుర్తు చేసుకున్నారు. ఇండియాలో వీకిపిడియా ఎప్పుడూ కూడా తన ఆసక్తిని కనబరుస్తుందని తెలియజేశారు. ఇటీవల కాలంలో మనం గనుక చూసినట్లైతే కాలేజీ స్టూడెంట్స్ వీకిపిడియా మీద ఎక్కువ శ్రద్దను కనబర్చడమే కాకుండా వారికి సంబంధించిన స్టడీ మెటరియల్స్‌ని కూడా వీకిపిడియాలో భద్రపరుస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot