Home
News

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల అవసరం లేకుండా చేస్తుందా?

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత చాట్‌బోట్‌లు ChatGPT, బింగ్ AI, Google Bard అందుబాటులోకి వచ్చాయి. మొదట్లో ఏఐ ఆధారిత చాట్‌బోట్‌ల పనితీరు చూసి అందరూ ముచ్చట పడ్డారు. పూర్తిస్థాయిలో వాటి పనితీరు వెలుగులోకి వచ్చాక చాలా మందిలో భయం మొదలైంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే చాట్‌బోట్‌ల కారణంగా భవిష్యత్‌లో ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అది ఎంతవరకు నిజమో చూద్దాం.

ఈ AI చాట్‌బోట్‌లు కథనాలు రాయగలవు మరియు సాఫ్ట్‌వేర్‌ కోడింగ్‌ను రాయగలవు, రివ్యూ చేయగలవు. టెక్ట్స్‌ ఇన్‌పుట్‌తో ఫోటోలను రూపొందించగలవు. ఏఐ ఆధారిత చాట్‌బోట్‌లోని ఈ పనితనమే.. రచయితలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, క్రియేటర్ల ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే ఆందోళన పెరుగుతోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్.. మనుషుల ఉద్యోగాలను ప్రమాదంలోకి నెడుతుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Artificial intelligence

మానవుల ఉద్యోగాలను ఏఐ ప్రమాదంలోకి నెడుతుందా అని గూగుల్‌ బార్డ్‌, మైక్రోసాఫ్ట్‌ బింగ్‌, ఓపెన్ ఏఐ చాట్‌బోట్‌ ChatGPTని ప్రశ్నించాం. బార్డ్.. సాఫ్ట్‌వేర్‌ కోడింగ్‌ రాయగల సామర్థ్యం ఉందని సంస్థ వెల్లడించిన నేపథ్యంలో ఆ టెక్నాలజీ.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలను తీసుకుంటుందా.. అని ప్రశ్నించారు. దీనికి ఏఐ ఆధారిత చాట్‌బోట్‌లు ఏం చెప్పాయంటే..?

Google Bard AI : గూగుల్ బార్డ్‌కు మానవ నైపుణ్యాలు లేవు. మరియు ఇంజినీరింగ్‌ను నిర్వహించే సామర్థ్యం లేదు. అందువల్ల, మానవులు ఉద్యోగాలను ప్రమాదంలోకి నెట్టే అవకాశం లేదని భావిస్తున్నామని బార్డ్‌ తెలిపింది. అయితే ఎక్కువ సమయం తీసుకొనే పనుల్లో ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు సాయం చేయగలదని.. ఆ సమయంలో మానవులు ఇతర ముఖ్యమైన అంశాలపై దృష్టిపెట్టే అవకాశం ఉంటుందని తెలిపింది.

"ఏఐ చాట్‌బోట్‌ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కొన్ని పనులను ఆటోమేట్‌ చేస్తుంది. కానీ వారిని పూర్తిగా భర్తీ చేసే అవకాశం లేదు. ఏఐ.. కోడ్‌ జనరేషన్, టెస్టింగ్‌, డీబగ్గింగ్‌ వంటి ఆటోమేటిక్ టాస్క్‌లు పూర్తిచేయగలదు. ఈ సమయంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇతర క్రియేటివ్‌, స్టాటజిక్‌ పనులపై దృష్టిపెట్టవచ్చు. ఇప్పటికీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత చాట్‌బోట్‌... సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలోని కొన్ని నైపుణ్యాలను అర్థం చేసుకోలేకపోయింది. సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్‌ అమలు సహా ఇతర ముఖ్యమైన పనుల కోసం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల అవసరం ఇంకా ఉంది" అని గూగుల్‌ బార్డ్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది.

దీంతోపాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో అవసరమైన కొన్ని నైపుణ్యాలైన క్రియేటివిటీ, సమస్య పరిష్కార నైపుణ్యం, కమ్యూనికేషన్‌ వంటి పనుల్లో మనుషులను భర్తీ చేసే సామర్థ్యం AIకి లేదని గూగుల్ బార్డ్‌ తెలిపింది. అయితే ఈ నైపుణ్యాలకు భవిష్యత్‌లో ఎక్కువ డిమాండ్‌ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ChatGPT : ఓపెన్‌ ఏఐ చాట్‌బోట్‌ ChatGPT కూడా గూగుల్‌ బార్డ్‌ తరహా అభిప్రాయం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో మనుషులు, ఏఐ కలిసి పనిచేస్తారని, మరిన్ని మంచి ప్రాజెక్టులను చేపడతారని చాట్‌జీపీటీ అభిప్రాయపడింది. అధిక సమయం వెచ్చించాల్సిన టాస్క్‌ను ఏఐ ఆటోమేట్ చేస్తుందని, ఆ సమయంలో ఇతర పనులపై దృష్టిపెట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది.

కోడ్‌ జనరేషన్‌, టెస్టింగ్, డీబగ్గింగ్‌లో ఏఐ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. మరియు తమ సామర్థ్యం, ఉత్పత్తులను మరింత మెరుగుపరుచుకొనేందుకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు సాయపడుతుంది. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి ప్రక్రియను మరింత మెరుగుపరిచేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయపడుతుంది.
క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం, ఉత్పత్తులను మెరుగుపరిచేందుకు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఆధారిత ChatGPT సాయం చేస్తుందని తెలిపింది. కానీ పూర్తిగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను భర్తీ చేసే సామర్థ్యం లేదని సమాధానం ఇచ్చింది.

Bing : మైక్రోసాఫ్ట్‌ ఆధారిత బింగ్ సైతం ఈ అంశంపై స్పందించింది. ఏఐ టెక్నాలజీలో గణనీయ మార్పు తీసుకొస్తుందని కానీ ఎవరి ఉద్యోగాలను భర్తీ చేయలేదని తెలిపింది. కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చినప్పుడు... ప్రజలు దానిని అనుగుణంగా పనిచేస్తారని పేర్కొంది.

"తన పరిశోధన ఫలితాల ప్రకారం... AI.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను భర్తీ చేయదు. కానీ పనితీరులో కొన్ని మార్పులు చేస్తుంది. ML, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, DevPOpsపై పనిచేస్తున్న ఉద్యోగాలు జాబ్‌ మార్కెట్లో ప్రయోజనం పొందుతారు. ఏఐ ఆధారిత చాట్‌బోట్‌లు కొన్ని టాస్క్‌లు ఆటోమేట్‌ చేయగలవు. కానీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను భర్తి చేయలేవు" అని బింగ్ అభిప్రాయపడింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Will Artificial intelligence replace Software Engineers in future
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X