ట్రెండ్‌సెట్టర్ ఊహాచిత్రం!!

Posted By: Staff

ట్రెండ్‌సెట్టర్ ఊహాచిత్రం!!

 

ఆపిల్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సరికొత్త గ్యాడ్జెట్ ఐఫోన్ 5 సెప్టంబర్ లో విడుదల కానుందంటూ పుకార్లు వ్యక్తమవతున్నాయి. ఈ ఆవిష్కరణకు సంబంధించిన అధికారిక ప్రకటనను జూన్ లో నిర్వహించే ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫిరెన్స్ లో వెలువరించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ డివైజ్ డిస్ ప్లే అదేవిధంగా డిజైనింగ్ కు సంబంధించి అనేకమైన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఐఫోన్ 5కు సంబంధించి ప్రముఖ చిత్రకారుడు జోన ఫ్యాసెట్ గీసిన చిత్రాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. లిక్విడ్ మెటల్ టెక్నాలజీతో ఐఫోన్ ను రూపొందించినట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఫోన్ నాజూకు అదేవిధంగా మరింత తక్కువ బరువును కలిగి ఉంటుందని సమాచారం.

ఫ్యాసెట్ భావనల మేరకు ఐఫోన్ 5 ఫీచర్లు:

చుట్టు కొలతలు 4.14” x 2.25”,

ఫోన్ మందం 7మిల్లీమీటర్లు,

4 అంగుళాల మల్టీ టచ్ స్ర్కీన్,

10మెగా పిక్సల్ రేర్ కెమెరా,

5మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

క్వాడ్ స్పీకర్స్.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot