షాక్ మీద షాకులిస్తున్న మైక్రోసాఫ్ట్!

Posted By: Staff

 షాక్ మీద షాకులిస్తున్న మైక్రోసాఫ్ట్!

తన సొంత హార్డ్‌వేర్ పరిజ్ఞానంతో టాబ్లెట్ కంప్యూటర్‌లను రూపొందించి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మైక్రోసాఫ్ట్ ప్రత్యర్ధి బ్రాండ్‌లకు మరో ఘులక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవల ప్రకటించిన విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లను సొంతగా వృద్ధి చేసేందుకు మైక్రోసాఫ్ట్ వ్యూహరచన చేస్తున్నట్లు ప్రముఖ విశ్లేషకుడు రిక్‌ షెర్‌ఫండ్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని మైక్రోసాఫ్ట్ వర్గాలు ధృవీకరించాల్సి ఉంది.

గత సోమవారం మైక్రోసాఫ్ట్‌చే ప్రకటించబడిన విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టంను ‘ప్రపంచపు ది బెస్ట్ వోఎస్‌’గా పలువురు అభివర్ణిస్తున్నారు. గత కొంత కాలంగా వోఎస్‌ల మార్కెట్‌ను ఆపిల్ (ఐవోఎస్), గుగూల్ (ఆండ్రాయిడ్)లు శాసిస్తున్న విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ తన సొంత పరిజ్ఞానంతో స్మార్ట్‌ఫోన్‌లను ఉత్పత్తి చెయ్యటం ప్రారంభిస్తే నోకియా మరింత ఇరకున పడే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా సామ్‌సంగ్, హెచ్‌టీసీ, హువావీ వంటి ప్రముఖ బ్రాండ్‌లు విండోస్ ఫోన్ 8 ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లను రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot