సోమవారం ఇంటర్నెట్ బంద్?

Posted By: Super

సోమవారం ఇంటర్నెట్ బంద్?

వాషింగ్టన్: ఇంటర్‌నెట్ ట్రాఫిక్‌ను దారి మళ్లించే వైరస్ వల్ల సోమవారం (ఈ నెల 9న) ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కంప్యూటర్లు ప్రభావితమయ్యే ప్రమాదం ఏర్పడింది. గత ఏడాది డీఎన్ఎస్ చేంజర్ వైరస్ విజృంభించడంతో కొన్ని సర్వర్లను అమెరికా మూసివేసింది. వైరస్ సోకిన కంప్యూటర్లను సరిచేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే తాత్కాలిక సర్వర్ల కాలపరిమితి వచ్చే సోమవారం ముగుస్తుండటంతో అధికారులు వాటిని నిలిపేయనున్నారు. దీంతో ముప్పు తప్పకపోవచ్చునని నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు.

దేశీయంగా డీఎన్‌ఎస్‌చేంజర్ వైరస్ బారిన పడిన 20,000 కంప్యూటర్లకు సోమవారం నుంచి ఇంటర్నెట్ అందుబాటులో ఉండకపోవచ్చని వెబ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ అందించే మెకాఫీ తెలిపింది. అంతర్జాతీయంగా 3 లక్షల పైగా పీసీలకూ ఇదే ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ప్రస్తుతం అమెరికా, ఇటలీ తర్వాత అత్యధికంగా భారత్‌లోని పీసీలే దీని బారిన పడ్డట్లు మెకాఫీ తెలిపింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot