భారత్‌లోకి టిక్‌టాక్ మళ్లీ ఎంట్రీ ఇవ్వనుందా.. కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఏం చెబుతున్నాయి?
TikTok India : 2020 సంవత్సరంలో భారత్ చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితుల సమయంలో భద్రతా కారణాలతో భారత్ అనేక యాప్స్‌ను బ్యాన్ చేసింది. ఇందులో టిప్‌టాక్, యూసీ బ్రౌజర్ వంటి అనేక చైనా యాప్‌లు ఉన్నాయి. అయితే భారత్‌పై అమెరికా భారీగా సుంకాలు విధింపు అనంతరం, చైనా, భారత్‌ల మధ్య పరిస్థితులు మెరుగవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే శుక్రవారం ఆసక్తికరంగా కొంత మందికి టిక్‌టాక్ వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
ప్లేస్టోర్ లో మాత్రం యాప్ అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రముఖ షార్ట్ వీడియో ప్లాట్‌ఫాం టిక్‌టాక్ పై భారత్ నిషేధం ఎత్తివేసే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. తాజా పరిణామాలపై కేంద్రం ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. భారత్‌లో టిక్‌టాక్ సేవలు అందుబాటులోకి వచ్చాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశాయి.

భారత్‌లో టిక్‌టాక్‌పై నిషేధం కొనసాగుతోందని తెలిపాయి. టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేతపై ఎలాంటి ఉత్తర్వులు జారీచేయలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఇప్పటికీ టిక్‌టాక్‌ను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచాయని తెలిపాయి. అయితే కొంత మందికి ఈ వెబ్‌సైట్ ఎలా ఓపెన్ అయిందో తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా టిక్‌టాక్ వెబ్‌సైట్ కొంత మందికి ఓపెన్ అవుతోంది. అయితే లాగిన్ అయ్యేందుకు అవకాశం లేదని తెలుస్తోంది. మరియు వీడియోలు అప్‌లోడ్ చేసేందుకు అవకాశం లేదని తెలుస్తోంది. దీంతోపాటు ప్లే స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులోకి రాలేదు.
గతంలో ఏం జరిగింది?
2020 సంవత్సరంలో భారత్, చైనా సరిహద్దుల్లో గల్వాన్ వద్ద భారీ స్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ప్రాణనష్టం కూడా చోటుచేసుకుంది. అనంతరం భద్రత కారణాలతో భారీ సంఖ్యలో చైనాకు చెందిన యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది. ఇందులో టిక్‌టాక్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్, బైడూ మ్యాప్ వంటి అనేక యాప్స్ ఉన్నాయి.

ఇలా పదుల సంఖ్యలో చైనాకు చెందిన యాప్స్‌ను భారత్‌లో నిషేధం విధించింది. అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే కొనసాగాయి. అయితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక అనేక కీలక, వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా రష్యా నుంచి భారీ ఎత్తున చమురు కొనుగోలు చేస్తుందనే కారణంగా భారత్‌పై 50 శాతం సుంఖాలు విధించారు. ఇప్పటికే 25 శాతం సుంకాలు అమల్లోకి రాగా.. త్వరలో మరో 25 శాతం అమల్లోకి రానున్నాయి. భారత్‌పై అమెరికా సుంకాల నేపథ్యంలో.. భారత్‌కు అనేక దేశాలు మద్దతుగా నిలిచాయి.
ఈ జాబితాలో చైనా కూడా ఉంది. ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా భారత్‌కు బహిరంగంగా మద్దతును ప్రకటించాయి. ఇందులో భాగంగా ఇటీవల చైనా విదేశాంగ శాఖ మంత్రి భారత్‌లో పర్యటించారు. ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌తోనూ భేటీ అయ్యారు. త్వరలో ప్రధాని మోడీ చైనాలో పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో టిక్‌టాక్ బ్యాన్ ఎత్తివేతపై వార్తలు రావడం గమనార్హం, అయితే భారత్ ప్రభుత్వం కూడా త్వరగానే ఈ అంశంపై స్పందించింది. ఇంకా నిషేధం కొనసాగుతోందని స్పష్టం చేసింది. తాము నిషేధానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపింది.


Click it and Unblock the Notifications








