రొమాంటిక్ క్రైం స్టోరీ (ప్రేయసిని చంపిన ప్రియుడు)?

Posted By: Staff

రొమాంటిక్ క్రైం స్టోరీ (ప్రేయసిని చంపిన ప్రియుడు)?

 

ప్యూర్టారికో: సామాజిక సంబంధాల సైట్ మరోసారి వార్తలో నిలిచింది. ఫేస్‌బుక్‌లో తన ప్రియురాలు పెడుతున్న పోస్ట్‌లకు మనస్థాపం చెందిన ప్రియుడు అమెను హతమర్చాడాని  ప్యూర్టారికో పోలీసులు వెల్లడించారు. శనివారం ఉదయం ఈ హత్య జరిగిందని ఆ ఇంట్లో రెండేళ్ల వయసున్న అమ్మాయి, పదేళ్ల అబ్బాయి ఉన్నారని, వీరు హతురాలు విలినియా సాంచెజ్ పిల్లలు అయి ఉండొచ్చని పోలీసు అధికారులు భావిస్తున్నారు. కామెరియోలోని సెంట్రల్ మౌంటెన్ టౌన్‌లో జరిగిన ఈ హత్యను ఎవరు చేశారో పిల్లలు చెప్పలేకపోతున్నారని పోలుస్ అధికారి కేండిడో పాగన్ తెలిపారు. సాంచేజ్ (27)ను తన ప్రియుడు జీసస్ రివేరా కత్తితో గొంతు కోసి ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటాడని ఖాకీలు ఓ అంచానకు వచ్చాయి.  అయితే రివేరా మనస్తాపం చెందేలా ఆమె ఫేస్‌బుక్‌లో ఏమి పోస్ట్ చేసిందో వివరాలు తెలియలేదని వారు చెబుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot