స్మార్ట్‌ఫోన్ ఛాలెంజ్: ఒక సంవత్సరం పాటు స్మార్ట్‌ఫోన్ వాడకపోతే 72లక్షలు మీ సొంతం

ఈ రోజులలో ప్రతీ మనిషీ స్మార్ట్‌ఫోన్ కు అడిక్ట్ అయిపోయారు . ఉదయం లేచింది మొదలు వాట్స్అప్ లో మెసేజస్ చూసుకోవడంతో మొదలు రాత్రి నిద్రపోయేవరకు ప్రతీ క్షణం ఫోన్ తోనే గడుపుతున్నాం .

|

ఈ రోజులలో ప్రతీ మనిషీ స్మార్ట్‌ఫోన్ కు అడిక్ట్ అయిపోయారు . ఉదయం లేచింది మొదలు వాట్స్అప్ లో మెసేజస్ చూసుకోవడంతో మొదలు రాత్రి నిద్రపోయేవరకు ప్రతీ క్షణం ఫోన్ తోనే గడుపుతున్నాం . చివరకు రోడ్ మీద నడుస్తునప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా ఫోన్ వాడుతున్నారు. ఈ నేపథ్యంలో కోకో-కోలా‌ కు చెందిన విటమిన్ వాటర్ అనే కంపెనీ సంవత్సరం పాటు స్మార్ట్‌ఫోన్ ఉపయాగించకపోతే 72లక్షలు నజరానా ప్రకటించింది. 'స్క్రోల్ ఫ్రీ ఫర్ ఎ ఇయర్' పేరుతో ఈ అమెరికన్ కంపెనీ పోటీ నిర్వహిస్తోంది.

2019లో స్మార్ట్‌ఫోన్ నుంచి రాబోతున్న సంచలనాలు ఇవే !2019లో స్మార్ట్‌ఫోన్ నుంచి రాబోతున్న సంచలనాలు ఇవే !

 ఒక సంవత్సరం పాటు  స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి....

ఒక సంవత్సరం పాటు స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి....

ఈ పోటీలో పాల్గొనేవారు ఒక సంవత్సరం పాటు స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి. వచ్చే సంవత్సరం జనవరి 8 నుంచి విటమిన్ వాటర్ సంస్థకు చెందిన అధికారిక ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

 #NoPhoneforaYear, #contest....

#NoPhoneforaYear, #contest....

ఫోన్‌ లేకుండా సమయాన్ని ఏడాది సమయాన్ని ఎలా గడపుతామనే విషయాన్ని హ్యాష్‌ట్యాగ్ #NoPhoneforaYear, #contest ఉపయోగించి పంపాల్సి ఉంటుంది. పోటీదారుడు ఇచ్చే సమధానంపై సంతృప్తి చెందితే అతడిని ఎంపిక చేస్తారు. అనంతరం కాంట్రాక్ట్ పత్రాలపై సంతకం చేయించుకుంటారు.

ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను వాడుకోవచ్చు....
 

ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను వాడుకోవచ్చు....

ఈ పోటీలో పాల్గొనే వారు కేవలం స్మార్ట్‌ఫోన్‌కు మాత్రమే దూరంగా ఉంటే సరిపోతోంది. ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను వాడుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ కానీ, ట్యాబ్లెట్ మాత్రం అస్సలు ఉపయోగించకూడదు.

ఆరు నెలలు దూరంగా ఉంటె రూ.7 లక్షలు...

ఆరు నెలలు దూరంగా ఉంటె రూ.7 లక్షలు...

ఈ పోటీలో పాల్గొనే వారు చివరికి వరకు పోటీలో ఉండాల్సిన అవసరం లేదు. కనీసం ఆరు నెలలు స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉంటె రూ.7 లక్షలు ఇవ్వనున్నట్టు విటమిన్ వాటర్ సంస్థ తెలిపింది.

1996 నాటి ఫీచర్ ఫోన్‌...

1996 నాటి ఫీచర్ ఫోన్‌...

ఇంట్లోవాళ్లతో , స్నేహితులతో మాట్లాడేందుకు మాత్రం 1996 నాటి ఫీచర్ ఫోన్‌ను ఇవ్వనున్నట్టు సంస్థ తెలిపింది. ఈ ఫోన్ లో కేవలం వాయిస్ కాల్స్ మాత్రమే చేసుకోవవచ్చు.

Best Mobiles in India

English summary
Win Rs 72 lakh for not using your smartphone for a year.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X