అందరికి ఎంతో సుపరిచితమైన Winamp ప్లేయర్ మళ్ళీ రాబోతుంది
కొన్ని సంవత్సరాల క్రితం కంప్యూటర్ లో ఆడియో ఫైళ్లని ప్లే చెయ్యటానికి అందుబాటులో కనిపించిన ఏకైక మార్గం WinAmp.ఆడియో ఫైల్స్ ను ప్లే చేయటానికి ప్రతి ఒక్కరు ఈ మీడియా ప్లేయర్ నే ఉపయోగించేవాళ్ళు
కొన్ని సంవత్సరాల క్రితం కంప్యూటర్ లో ఆడియో ఫైళ్లని ప్లే చెయ్యటానికి అందుబాటులో కనిపించిన ఏకైక మార్గం WinAmp.ఆడియో ఫైల్స్ ను ప్లే చేయటానికి ప్రతి ఒక్కరు ఈ మీడియా ప్లేయర్ నే ఉపయోగించేవాళ్ళు . కాగా VLC Media Player వచ్చాక దీని వాడకం చాలా తక్కువ అయిపోయింది . అయితే 2014లో Radionomy అనే సంస్థ దీన్ని కొనుగోలు చేసిన తర్వాత కొద్దికాలానికే దాని డెవలెప్మెంట్ ఆగిపోయింది. ఇప్పటికీ WinAmp ఫోరమ్స్ ద్వారా దాన్ని డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ విండోస్ తాజా వెర్షన్లని అది సపోర్ట్ చేయదు.

WinAmp 5.8 అనే లేటెస్ట్ వెర్షన్ రూపంలో....
అయితే WinAmp 5.8 అనే లేటెస్ట్ వెర్షన్ రూపంలో మళ్లీ రాబోతోంది. అది తాజా Windows 10 ఆపరేటింగ్ సిస్టంని సపోర్ట్ చేస్తోంది. అనేక కొత్త సదుపాయాలతోపాటు, పలురకాల బగ్స్ కూడా దీంట్లో సరి చేయబడ్డాయి.

ప్రస్తుతానికి ఈ వెర్షన్‌కి సంబంధించిన....
అయితే ప్రస్తుతానికి ఈ వెర్షన్‌కి సంబంధించిన లీక్డ్ బిల్డ్ ఇంటర్ నెట్ లో కొన్ని ప్రదేశాల్లో అనధికారికంగా లభిస్తున్నప్పటికీ, అది వైరస్ ఛెకింగ్‌లో అనుమానాస్పదంగా ఉంది . రాబోయే కొద్ది రోజుల్లో WinAmp అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ WinAmp 5.8 తాజా వెర్షన్ లభించబోతోంది. అప్పటివరకు వేచి చూడటం మంచిది.

Pro వెర్షన్ అందించిన WinAmp.....
గతంలో కొద్దికాలంపాటు అదనపు సదుపాయాల కోసం కొంత మొత్తాన్ని చార్జి చేస్తూ Pro వెర్షన్ అందించిన WinAmp తిరిగి పూర్తిస్థాయిలో Free వెర్షన్‌గా వస్తున్నట్లు తెలుస్తోంది.

VLC Media Player వచ్చిన తర్వాత .....
VLC Media Player వచ్చిన తర్వాత WinAmp వాడేవాళ్ళు తగ్గి పోయినప్పటికీ ఎప్పటినుంచో కంప్యూటర్ వాడే చాలామందికి ఒక తీపి జ్ఞాపకంగా ఈ మీడియా ప్లేయర్ నిలుస్తుందనడంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications








