విండోస్ 10 ఇక ఉచితం కాదు!

2015, జూలై 29న మైక్రోసాఫ్ట్ తన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంను మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. మొదటి ఏడాది పాటు ఈ ఆపరేటింగ్ సిస్టంను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కూడా మైక్రోసాఫ్ట్ అదే రోజున స్పష్టం చేసింది. అయితే ఈ ఆపరేటింగ్ సిస్టంను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే విండోస్ 7, విండోస్ 8, విండోస్ 8.1 యూజర్ల ఆపరేటింగ్ సిస్టంలు ఖచ్చితంగా జెన్యున్ వర్షన్‌లు అయిఉండాలని ఓ షరతు కూడా మైక్రోసాఫ్ట్ విధించింది.

విండోస్ 10 ఇక ఉచితం కాదు!

విండోస్ 10ను ఉచితంగా ఆఫర్ చేస్తున్నామని మైక్రోసాఫ్ట్ చెప్పినప్పటికి చాలా మంది ఇంకా పాత వర్షన్‌లలోనే కొనసాగుతున్నారు. మైక్రోసాఫ్ట్ వెల్లడించిన దాని ప్రకారం జూలై 29తో ఉచిత ఆఫర్ ముగిసి పోయింది. మరి ఇప్పటికి విండోస్ 7, విండోస్ 8, విండోస్ 8.1 వర్సన్‌లను ఉపయోగించుకుంటోన్న వారి భవిష్యత్ ఏంటి..?

Read More : రూ.149కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఉచిత ఫోన్ కాల్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇక పై విండోస్ 10 లైసెన్సును కొనుగోలు చేయవల్సిందే

విండోస్ 10 ఏడాది ఉచిత ఆఫర్ ముగిసిపోయిన నేపథ్యంలో పాత వర్షన్ విండోస్ యూజర్లు ఇక పై విండోస్ 10కు అప్‌గ్రేడ్ అవ్వాలంటే తప్పనిసరిగా విండోస్ 10 లైసెన్సును కొనుగోలు చేయవల్సి ఉంటుంది.

మీరు విండోస్ 8.1లోనే కొనసాగుతున్నట్లయితే

విండోస్ 10 ఉచిత అప్‌గ్రేడ్‌ను మిస్ చేసుకుని ఇప్పటికి మీరు విండోస్ 8.1లోనే కొనసాగుతున్నట్లయితే జనవరి 2018 వరకు మీ ఆపరేటింగ్ సిస్టంకు అన్ని రకాల అప్‌డేట్స్ అందుతాయి. ఆ తరువాత ఒక్కొక్కటిగా అప్‌డేట్స్ నిలిచిపోతాయి. 2023తో సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా నిలిచిపోతాయి.

మీరు విండోస్ 8లో కొనసాగుతున్నట్లయితే

మీరు ఇంకా విండోస్ 8లోనే కొనసాగుతున్నట్లయితే మీరు చిక్కుల్లో ఉన్నట్లు. ఇప్పటికి విండోస్ 8కు సాప్ట్‌వేర్ అప్‌డేట్స్ నిలిచిపోయాయి. కాబట్టి వెంటనే విండోస్ 8.1కైనా అప్‌గ్రేడ్ అవ్వండి.

విండోస్ 7లోనే కొనసాగుతున్నట్లయితే

మీరు ఇంకా విండోస్ 7లోనే కొనసాగుతున్నట్లయితే ఎటువంటి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ మీకు అందే అవకాశం లేదు. సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తున్నప్పటికి అవి 2020 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి

విండోస్ ఎక్స్‌పీ వర్షన్‌ ఇప్పటికే నిలిచిపోయింది

విండోస్ ఎక్స్‌పీ వర్షన్‌కు మైక్రోసాఫ్ట్ ఇప్పటికే సపోర్ట్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. విండోస్ విస్టాకు సపోర్ట్ 2017తో నిలిచిపోనుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Windows 10 No Longer Free. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot