Windows 10 PC లో స్క్రీన్‌ను రికార్డ్ చేయడం ఎలా?

|

కరోనా ప్రభావం ప్రపంచం మొత్తం మీద ఏ విధంగా పడిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దాదాపుగా రెండు సంవత్సరాలుగా అందరు ఇంటి వద్దనే ఉంటూ పనిచేయడం చేస్తున్నారు. ఇంటి వద్ద ఉంటూ స్నేహితులు మరియు సహోద్యోగులతో ఏదైనా సమాచారాన్ని పంచుకోవడానికి అధికంగా స్క్రీన్‌షాట్‌లను ఉపయోగించేవారు.

 

స్క్రీన్‌షాట్‌లను

ఏదైనా ఒక ఫోటో అనేది వెయ్యి పదాలకు విలువైనది. అయితే వీడియో మాత్రం మిలియన్ విలువైనది అని ఊరకనే అనలేదు. ఏదైనా మరచిపోయే విషయాలను గుర్తుంచుకోవడానికి స్క్రీన్‌షాట్‌లను బుక్‌మార్క్‌గా కూడా ఉపయోగించే వారు అధికంగా ఉన్నారు. కానీ అన్ని సమయాలలో స్క్రీన్‌షాట్‌లు సరిపోవు. అవసరమైన సమాచారాన్ని మరింత మెరుగ్గా తెలియజేయడానికి కొన్నిసార్లు డైనమిక్ పరిష్కారం అవసరం అవసరం అవుతుంది. ఇలాంటి సందర్భాలలో 'స్క్రీన్ రికార్డింగ్' అనే ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది.

 

 

స్క్రీన్ రికార్డింగ్ ఫంక్షనాలిటీ

PC లేదా లాప్ టాప్ లను అధికంగా వినియోగించే వినియోగదారులు స్క్రీన్ రికార్డింగ్ ఫంక్షనాలిటీతో ఏదైనా సమాచారాన్ని రికార్డింగ్ చేయడానికి అనుమతిస్తుంది. కరోనా సమయంలో అధిక మంది తమ సహోద్యోగులతో మాట్లాడడానికి వీడియో కాలింగ్ వంటి యాప్ లను అధికంగా వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ఆన్ లైన్ పద్దతిలో తమకు తెలియని వాటిని నేర్చుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు. ఇటువంటి సమయంలో ఏదైనా ఒక పనిని నిర్వహించడానికి వారు అనుసరించాల్సిన దశను మీరు ఎవరికైనా చూపించాల్సిన అవసరం వచ్చినప్పుడు 'స్క్రీన్ రికార్డింగ్' అనే ఫీచర్ ప్రత్యేకంగా సహాయపడుతుంది.

Xbox
 

Windows 10 తో రన్ అయ్యే PC మరియు లాప్ టాప్లను వినియోగిస్తున్న వినియోగదారులు వారి PC స్క్రీన్‌లను రికార్డ్ చేయడానికి వీలుగా Xbox గేమ్ బార్ యుటిలిటీతో స్క్రీన్ రికార్డింగ్ అనుమతిస్తుంది. దీని సాయంతో వినియోగదారులు స్క్రీన్‌పై కదలికలతో పాటు వారి స్వంత ఆడియోను కూడా రికార్డ్ చేయడానికి అనుమతిస్తుంది. కానీ మీకు అది నచ్చకపోతే కనుక మీరు స్క్రీన్ రికార్డింగ్ కోసం స్క్రీన్ రికార్డింగ్ యాప్‌ను కూడా ఎంచుకోవచ్చు. విండోస్ 10 పవర్డ్ PCలను మీరు ఉపయోగిస్తుంటే కనుక స్క్రీన్‌ను రికార్డ్ చేయడం ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Xbox గేమ్ బార్‌ని ఉపయోగించి స్క్రీన్‌ను రికార్డ్ చేసే విధానం

Xbox గేమ్ బార్‌ని ఉపయోగించి స్క్రీన్‌ను రికార్డ్ చేసే విధానం

స్టెప్ 1: మీరు రికార్డ్ చేయాలనుకుంటున్న యాప్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2: ఇప్పుడు మీ PCలో Xbox గేమ్ బార్‌ను ఓపెన్ చేయడానికి ఒకే సమయంలో 'Windows + G' కీలను నొక్కండి.

స్టెప్ 3: తర్వాత వీడియోను క్యాప్చర్ చేయడం ప్రారంభించడానికి కుడివైపున ఉన్న స్టార్ట్ రికార్డింగ్ బటన్‌పై క్లిక్ చేయండి. ప్రత్యామ్నాయంగా మీరు దాని కోసం Windows + Alt + R కీలను కూడా నొక్కవచ్చు.

స్టెప్ 4: మీరు స్క్రీన్ వీడియోతో పాటు మీ వాయిస్‌ని రికార్డ్ చేయడానికి మైక్రోఫోన్ బటన్‌ను నొక్కవచ్చు.

స్టెప్ 5: మీరు రికార్డింగ్ పూర్తి చేసిన తర్వాత రికార్డింగ్‌ని ఆపడానికి రెడ్ డాట్‌పై నొక్కండి.

స్టెప్ 6: మీరు రికార్డింగ్ పూర్తి చేసిన తర్వాత దిగువ భాగంలోని స్పేస్‌లో ఈ రికార్డింగ్‌ని చూడవచ్చు.

స్టెప్ 7: మీరు రికార్డ్ చేసిన వీడియోపై రైట్ క్లిక్ చేసి 'వ్యూ ఫోల్డర్' ఆప్షన్‌పై క్లిక్ చేయడంతో వీడియో ఎక్కడ సేవ్ చేయబడిందో చూడవచ్చు. తరువాత దాన్ని మీ యొక్క స్నేహితుడికి లేదా సహోద్యోగికి షేర్ సులభంగా షేర్ చేయవచ్చు.

 

Best Mobiles in India

English summary
Windows 10 PC Screen Recording Process Step by Step

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X