Windows 11 ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా? కొత్తధనం ఏమి ఉంది??

|

విండోస్ 11 ఈవెంట్ నిన్న విజయవంతంగా ముగిసింది. మైక్రోసాఫ్ట్ సంస్థ ఇప్పుడు తన కొత్త విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ను విడుదల చేసింది. 2015 జూలైలో ప్రస్తుత తరం విండోస్ అయిన విండోస్ 10 ను విడుదల చేసిన ఆరు సంవత్సరాల తరువాత విండోస్ 11 ను విడుదల చేసారు. విండోస్ 11 యొక్క కొత్త అప్ డేట్ ను పొందాలని ప్రతి ఒక్కరు చాలా కుతూహలంగా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ నుండి కొత్తగా వచ్చిన తరువాతి తరం విండోస్ ప్రధానంగా రీడిజైన్, తాజా బూట్ స్క్రీన్ మరియు స్టార్ట్-అప్ సౌండ్‌ను స్టార్ట్ మెను మరియు విడ్జెట్‌లను అందిస్తుంది. ఇది విండోస్ 11 తో ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన కంప్యూటింగ్ UI లలో రెండు Chrome OS మరియు macOS లను తీసుకోవాలి.

విండోస్ 11 లో కొత్తధనం

విండోస్ 11 లో కొత్తధనం

విండోస్ 11 విడుదల అయింది. మీరు ఇప్పుడు విండోస్ 10 వాడుతూ ఉంటే కనుక మైక్రోసాఫ్ట్ యొక్క కొత్తగా విడుదల చేయబడిన ఆపరేటింగ్ సిస్టమ్‌కి అప్‌గ్రేడ్ చేయడం ఉచితం పొందవచ్చు అని కంపెనీ తన వర్చువల్ ఈవెంట్ తర్వాత బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. మీ PC కనీస యాప్ లను తీర్చినంత వరకు మీరు విండోస్ 11 యొక్క క్రొత్త అప్ డేట్ లకు సాధారణంగా అప్‌డేట్ చేసే విధంగానే విండోస్ 11 కు అప్‌డేట్ చేయగలరు.

వోడాఫోన్ ఐడియా(Vi) రూ.199 ప్లాన్‌లో రోజువారి డేటా పెరిగింది...వోడాఫోన్ ఐడియా(Vi) రూ.199 ప్లాన్‌లో రోజువారి డేటా పెరిగింది...

విండోస్ 10 PC

మీ ప్రస్తుత విండోస్ 10 PC ని విండోస్ 11 కి ఉచితంగా అప్‌గ్రేడ్ చేయడానికి అర్హత ఉందో లేదో చూడడం ఇప్పుడు చాలా సులభం. ఇందుకోసం PC హెల్త్ చెక్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది. దీనిని పొందడానికి విండోస్.కామ్‌కు వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు సాధారణ విడుదలకు మధ్య మీరు కొత్త పిసిని కొనుగోలు చేస్తే కనుక ఆ కంప్యూటర్ కూడా ఉచిత అప్‌గ్రేడ్‌కు అర్హులు అవుతారు.

 

విండోస్

మీరు ఇంకా విండోస్ 10 కి అప్‌డేట్ చేయకుండా పాత తరం విండోస్ ను ఉపయోగిస్తూ ఉంటే కనుక చింతించకండి. విండోస్ 10 ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఒక ట్రిక్ ఉంది. అది ఇప్పటికీ పనిచేస్తుంది. విండోస్ 11 అప్‌గ్రేడ్ కోసం మీ మెషీన్‌ను సిద్ధం చేయడానికి స్విచ్ చేయడానికి ఇప్పుడు ఇదే మంచి సమయం.

అందుబాటులోకి వచ్చిన తర్వాత విండోస్ 11 ను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

అందుబాటులోకి వచ్చిన తర్వాత విండోస్ 11 ను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

విండోస్ 11 అందుబాటులోకి వచ్చిన తర్వాత మీ యొక్క PC ని అప్‌గ్రేడ్‌ చేయడం కోసం విండోస్ యొక్క ఏదైనా క్రొత్త సంస్కరణతో మీరు డౌన్‌లోడ్ చేసుకోవలసి ఉంటుంది. ఇందుకోసం వినియోగదారులు సెట్టింగులు> అప్‌డేట్ & ప్రైవసీ > విండోస్ అప్‌డేట్ వంటి పద్దతులను పాటించి తరువాత కనిపించే అప్‌డేట్ కోసం తనిఖీ చేసి దాని మీద క్లిక్ చేయండి. విండోస్ 11 మీకు అందుబాటులో ఉంటే కనుక మీరు అప్‌డేట్ యొక్క అన్ని రకాల ఫీచర్లను పొందగలరు. ఇందుకోసం మీరు డౌన్‌లోడ్ ఎంపిక మీద క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేయవలసి ఉంటుంది.

విండోస్ 11

మీరు విండోస్ 11 ను ముందుగానే పరీక్షించాలనుకుంటే కనుక వారికి ఒక మార్గం ఉంది. విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్‌లో ఉన్నవారికి ప్రారంభ బీటా వెర్షన్ వచ్చే వారం అందుబాటులో ఉంటుంది. అలాగే జూలై నెలలో పబ్లిక్ బీటా వెర్షన్ విడుదల అవుతుంది. అయినప్పటికీ మీకు రెండవ టెస్టర్ డివైస్ లో ఉంటే మాత్రమే బీటాను ఇన్‌స్టాల్ చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము. మీ యొక్క మెయిన్ పరికరంలో పరీక్షించకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఏవైనా దోషాలు ఉండే అవకాశం అధికంగా ఉండవచ్చు.

Best Mobiles in India

English summary
Windows 11 Download & Install Process Step by Step: Free update, What's New Features and More Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X