Home
News

విండోస్‌ 11 OS లో కొత్త అప్‌డేట్‌లు.. ఈ రెండు ఫీచర్‌లు ఎలా ఉపయోగపడతాయి..?

కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌ లో అనేక మంది విండోస్‌ OS ను వినియోగిస్తుంటారు. యూజర్‌లకు విండోస్‌ 11 (Windows 11) ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ OS అప్‌డేట్‌ ద్వారా అనేక కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పటికీ విండోస్‌ 10, విండోస్‌ 7 సహా ఇతర OS లను వినియోగిస్తున్న యూజర్‌ లు విండోస్‌ 11 కు అప్‌డేట్‌ కావాలని ఇప్పటికే సంస్థ సూచనలు చేసింది. ఈ కొత్త OS ను అక్టోబర్‌ 2021 లో మైక్రోసాఫ్ట్‌ విడుదల చేసింది.

కొత్తగా విండోస్‌ 11 ఇన్‌సైడర్‌ ప్రివ్యూ అప్‌డేట్‌ ను విడుదల చేసింది. దీంతో మైక్రోసాఫ్ట్‌ పెయింట్‌, విండోస్‌ సెర్చ్‌లో అనేక అప్‌గ్రేడ్‌ లు రానున్నాయి. ఈ కొత్త అప్‌డేట్‌ ద్వారా పెయింట్‌ లో కోపైలెట్‌ మెనూ మరియు వన్‌డ్రైవ్‌ ఫైల్స్‌ కోసం సెమాంటిక్‌ ఇండెక్స్‌ తో సెర్చ్‌ ఆప్షన్‌ను మెరుగుపరుస్తుంది.

Windows 11 new update

మైక్రోసాఫ్ట్ గత రెండు సంవత్సరాలుగా పెయింట్‌ కు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారిత ఫీచర్‌లను విడుదల చేస్తోంది. అయితే పైన తెలిపిన రెండు ఫీచర్‌లు స్నాప్‌డ్రాగన్ ఆధారిత కోపైలెట్‌ + కంప్యూటర్‌లకు మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది.

పెయింట్‌ కోసం కొత్తగా నాలుగు ఫీచర్‌ లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో రిమూవ్‌ బ్యాక్‌గ్రౌండ్‌, జెనరేటివ్‌ ఎరేజ్‌, ఇమేజ్‌ క్రియేటర్‌, కో క్రియేటర్ వంటి ఆప్షన్‌ లు ఉన్నాయి.
కో క్రియేటర్‌- డూడుల్స్‌ నుంచి ఏఐ ఆధారిత ఇమేజ్‌లను క్రియేట్ చేస్తుంది.

రిమూవ్‌ బ్యాగ్రౌండ్‌ - ఒకే ఒక్క క్లిక్‌ తో బ్యాక్‌గ్రౌండ్‌ ను డిలీట్‌ చేస్తుంది.
జనరేటివ్‌ ఎరేజ్‌ - బ్యాక్‌గ్రౌండ్‌ ను ఆకర్షణీయంగా మార్చేందుకు వీలుగా అవసరం లేని వస్తువులను తొలగిస్తుంది.
ఇమేజ్‌ క్రియేటర్ - యూజర్‌ అవసరాలకు అనుగుణంగా టెక్ట్స్‌ నుంచి ఇమేజ్‌ను క్రియేట్‌ చేస్తుంది.

విండోస్‌ సెర్చ్‌లోనూ అనేక అప్‌గ్రేడ్‌లను తీసుకొచ్చింది. గత నెలలో ఈ ఫీచర్‌ను లాంచ్ చేసింది. సెమాంటిక్‌ ఇండెక్సింగ్‌ ఆధారంగా విండోస్‌ సెర్చ్‌ను మెరుగుపరుస్తుంది. నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ను ఉపయోగిస్తుంది. అయితే ఈ ఫీచర్‌ కూడా ప్రత్యేకంగా కో పైలెట్‌ + కంప్యూటర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

విండోస్‌ యూజర్‌లలో ప్రస్తుతం అధిక శాతం విండోస్‌ 10 ను వినియోగిస్తున్నారు. ఈ OS కు అక్టోబర్‌ నెల వరకు మాత్రమే సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందిస్తామని ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. అయితే యూజర్లు వీలైనంత వేగంగా విండోస్ 11 కు అప్‌గ్రేడ్‌ కావాలని సూచించింది.

అయితే సైబర్ భద్రతా నిపుణులు మాత్రం అక్టోబర్‌ నెల వరకు ఎదురుచూడవద్దని.. వెంటనే విండోస్‌ OS ను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం 60 శాతానికి పైగా విండోస్ 10 ను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్‌ 11 OS ను 2021 సంవత్సరం అక్టోబర్‌ నెలలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ OS కు అప్‌డేట్‌ అయ్యేందుకు కంప్యూటర్‌/ ల్యాప్‌టాప్‌ కనీసం 64 Bit ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉండాలి. దీంతోపాటు 1 GHz స్పీడ్‌ ప్రాసెసర్‌, కనీసం 4GB ర్యామ్ మరియు 64GB కనీస స్టోరేజీని కలిగి ఉండాలి.

మైక్రోసాఫ్ట్‌.. విండోస్‌ 7 OS ను 2009 సంవత్సరంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే 2012 లో విండోస్‌ 8, 2013 లో విండోస్ 8.1ను వాంచ్‌ చేసింది. అనంతరం విండోస్‌ 10ను 2015 సంవత్సరంలో విడుదల చేసింది. 2021 లో విండోస్‌ 11 OS ను లాంచ్ చేసింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Windows 11 new update gets enhancements in paint and search full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X