విండోస్‌లో ఉన్న ముఖ్యమైన సౌకర్యాలు వన్ ఇండియా పాఠకుల కోసం

By Super
|
విండోస్‌లో ఉన్న ముఖ్యమైన సౌకర్యాలు వన్ ఇండియా పాఠకుల కోసం
ఆపరేటింగ్‌ సిస్టం వెర్షన్‌ మారిందంటే కొత్త సౌకర్యాలు అనేకం. ఆకట్టుకునే వింతలు తెరపై చోటు చేసుకుంటాయి. టాస్క్‌బార్‌తో కావాల్సిన వాటిని ఠక్కున ఓపెన్‌ చేసుకోవచ్చు. సులువైన ఇంటర్ఫేస్‌లో ఫైల్స్‌ని బ్రౌజ్‌ చేయవచ్చు. ఈ నేపథ్యంలో 'విండోస్‌ సెవెన్‌లో విలువైన సౌకర్యాలు?' ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం...

* మొదటిది ఇతరులు ఎవరైనా మీ సిస్టంపై పని చేస్తున్నప్పుడు ఎలాంటి మార్పులు చేయడానికి వీలు లేకుండా చేయవచ్చు. అందుకు 'పీసీ సేఫ్‌గార్డ్‌'ని ఎనేబుల్‌ చేస్తే సరిపోతుంది. ఇది ఓఎస్‌లో ముందుగానే ఇన్‌స్టాల్‌ అయ్యుంటుంది. కంట్రోల్‌ ప్యానల్‌లోకి వెళ్లి యూజర్‌ ఎకౌంట్‌ను క్రియేట్‌ చేసేప్పుడు Set Up Pc Safeguard ఆప్షన్‌ను ఆన్‌ చేయండి. ఫొటోలు, సినిమాలు చూస్తున్నప్పుడు స్క్రీన్‌ రిషల్యూషన్‌లో ఏదైనా మార్పు చేయాలంటే Display Calibration wizard సదుపాయంతో మార్చుకునే వీలుంది. అందుకు తెరపై కనిపించే విండోస్‌ లోగోపై క్లిక్‌ చేసి DCCWను ఎంచుకోండి.

 

కంప్యూటర్‌ను ఇతరులకు షేరింగ్‌కి ఇస్తే మీకు సంబంధించిన అప్లికేషన్స్‌ని ఎవ్వరూ యాక్సెస్‌ కాకుండా చేసేందుకు చక్కని ఆప్షన్‌ ఉంది. అదే AppLocker. విండోస్‌ 7 అన్‌లాకర్‌గా పిలుస్తున్నారు. దీన్ని వాడడం ద్వారా కొత్త సాఫ్ట్‌వేర్‌లను యూజర్‌ ఇన్‌స్టాల్‌ చేయలేడు. విండోస్‌ లోగోపై క్లిక్‌ చేసి బాక్స్‌లోGpedit.msc టైప్‌ చేయండి. వచ్చిన విండోలోComputer Configuration-> windows Settings-> Security Settings-> Application Control Policies-> AppLockerలోకి వెళ్లి టూల్‌ను ఎనేబుల్‌ చేయవచ్చు.

* రెండవది డేటాని ఎన్‌క్రిప్ట్‌ పద్ధతిలో సురక్షితం చేసుకోవాలంటే ప్రత్యేక టూల్స్‌ని వాడాల్సిందే. విండోస్‌ సెవెన్‌ అంత కష్టం అక్కర్లేదు. మీరు వాడుతున్న యూఎస్‌బీని పాస్‌వర్డ్‌తో సురక్షితం చేయాలంటే BitLockerతో తాళం వేయవచ్చు. మైక్రోసాఫ్ట్‌ బిట్‌లాకర్‌ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. సిస్టంకి డ్రైవ్‌ కనెక్ట్‌ చేసి మై కంప్యూటర్‌లోని డ్రైవ్‌పై రైట్‌క్లిక్‌ చేయండి. వచ్చిన పాప్‌అప్‌ మెనూలోని Turn on BitLockerపై క్లిక్‌ చేయాలి. ప్రాసెస్‌ పూర్తయ్యాక వచ్చిన విండోలో పాస్‌వర్డ్‌లను ఎంటర్‌ చేసి డేటాని ఎన్‌క్రిప్ట్‌ చేయవచ్చు.

ఏదైనా ఫైల్‌ అడ్రస్‌ పాత్‌ తెలుసుకోవాలంటే ఏం చేస్తారు? ఫైల్‌పై రైట్‌క్లిక్‌ చేసి ప్రాపర్టీస్‌లోకి వెళితేగానీ తెలియదు. విండోస్‌ సెవెన్‌లో కావాల్సిన ఫైల్‌ను డ్రాగ్‌ చేసి డాస్‌ ప్రాంప్ట్‌లో వదిలేస్తే చాలు అడ్రస్‌ పాత్‌ ప్రత్యక్షమవుతుంది.

* ఇక మూడవది మీకు ఇష్టమైన ఫొటోలను డెస్క్‌టాప్‌ వాల్‌పేపర్‌గా పెట్టుకోవాలంటే సాధారణంగా ప్రత్యేక టూల్స్‌ అవసరమే. కానీ, విండోస్‌ 7లో టూల్స్‌ని ఇన్‌స్టాల్‌ చేయకుండానే ఫొటోలను బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టుకోవచ్చు. అవి ఆటోమాటిక్‌గా నిర్ణీత సమయంలో మారిపోతాయి కూడా. అందుకు డెస్క్‌టాప్‌పై రైట్‌క్లిక్‌ చేసి Personailize-> Desktop Backgroundలోకి వెళ్లాలి. Ctrl 'కీ' నొక్కి ఉంచి మీకు కావాల్సిన ఇమేజ్‌లను సెలెక్ట్‌ చేసుకుని వాల్‌పేపర్లుగా పెట్టుకోవచ్చు. బాక్స్‌లో నిర్ణీత సమయాన్ని కూడా ఎంచుకోవచ్చు.

డెస్క్‌టాప్‌ను మాగ్నిఫైయర్‌లో చూడాలంటే Windows Key+Plus keyలను కలిపి నొక్కండి. జూమ్‌ తగ్గించాలంటే Windows key+Minus Key. ప్రస్తుతం పని చేస్తున్న విండో కాకుండా ఓపెన్‌ చేసిన అన్ని విండోలను మినిమైజ్‌ చేయాలంటే Windows Key+Home Keyలను నొక్కండి. ముఖ్యమైన వీడియోలను స్టార్ట్‌ మెనూలో పెట్టుకోవచ్చని మీకు తెలుసా? డెస్క్‌టాప్‌పై రైట్‌క్లిక్‌ చేసిProperties-> Start Menu-> Customizeలోకి వెళ్లి Display as a link తో వీడియోలను పెట్టుకోవచ్చు. ఎక్స్‌పీలో కొత్త ఫాంట్‌లను ఇన్‌స్టాల్‌ చేయడం పెద్

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X