విండోస్ 8లో ఉన్న మోడ్రన్ విండోస్ టాస్క్ మేనేజర్ సమాచారం

Posted By: Super

విండోస్ 8లో ఉన్న మోడ్రన్ విండోస్ టాస్క్ మేనేజర్ సమాచారం

మొన్నటి వరకు మార్కెట్‌లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్7 ఎలా ఉండబోతుంది అంటూ చర్చలు జరిగాయి. తీరా అది విడుదలయి మార్కెట్ తన హావా సాగిస్తుంది. టెక్నాలజీలో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌వే వాడుతుంటారు. దానికోసం ఇప్పుడు కొత్తగా విండోస్8ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాలని చూస్తున్నారు మైక్రోసాఫ్ట్ కంపెనీ. మీకోసం విండోస్ 8కి సంబంధించిన సమాచారం...

ప్రస్తుతం డవలప్ మెంట్ స్టేజిలో ఉన్నటువంటి విండోస్8 గురించి మా స్నేహితుల ద్వారా కొంత సమాచారం సేకరించిన నేను అది మీకోసం ప్రవేశపెడుతున్నాను. ఈసారి విండోస్8కి సంబంధించి నేను టాస్క్ మేనేజర్ గురించిన సమాచారం మీముందుకి తెస్తున్నాను. విండోస్8 టాస్క్ మేనేజర్‌ని ముద్దుగా మోడ్రన్ విండోస్ టాస్క్ మేనేజర్/అడ్వాన్స్ టాస్క్ మేనేజర్ పేరుగా పెట్టడం జరిగింది. డిఫాల్ట్‌గా విండోస్8 మోడ్రన్ టాస్క్ మేనేజర్ కనిపించకపోయినప్పటికీ ఈ క్రింద ఉన్నటువంటి రిజస్టర్ లింక్‌ని యాక్టివేట్ చేసుకుంటే కనిపిస్తుంది.

HKEY_LOCAL_MACHINE\Software\Microsoft\Windows\CurrentVersion\TaskUI,

Create a 32bit value “TaskUIEnabled”, set its value to “1″

ఐతే ఇక్కడ మీరు కొన్ని నియమాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం డవలపింగ్ స్టేజిలో ఉండడం వల్ల విండోస్8 మోడ్రన్ టాస్క్ మేనేజర్ మీరు క్లోజ్ చేసినటువంటి అప్లికేషన్స్‌ని ప్రాసెస్ లిస్ట్‌లో చూపిస్తుంది. మీకోసం విండోస్8 మోడ్రన్ టాస్క్ మేనేజర్ మరోక స్క్రీన్ షాట్... ఇది మాత్రమే కాకుండా మైక్రోసాఫ్ట్ టాస్క్ మేనేజర్‌ని, రిసోర్స్ మేనేజర్‌తో కలపి ఇంటిగ్రేడ్ చేసే యోచనలో ఉంది. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి స్క్రీన్ షాట్స్ అన్ని ఫ్రారంభ దశలో ఉన్నటువంటి విండోస్8 ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించినవి. చివరకు విడుదలయ్యేటటువంటి విండోస్8 ఆపరేటింగ్ సిస్టమ్ మోడ్రన్ టాస్క్ మేనేజర్ దీని మాదిరే ఉండాలని రూలు ఏమి లేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot