డవలప్‌మెంట్ టైమ్‌లోనే లీకైన విండోస్ 8 బిల్డ్ మొదటి మైల్‌స్టోన్‌

Posted By: Super

డవలప్‌మెంట్ టైమ్‌లోనే లీకైన విండోస్ 8 బిల్డ్ మొదటి మైల్‌స్టోన్‌

సాధారణంగా ప్రజలు కొత్తది ఏదైనా వచ్చిందంటే చాలు దానికోసం అర్రులు చాస్తూ ఉంటారు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న రోజుల్లో రోజుకో కొత్త టెక్నాలజీ అంటూ మార్కెట్లోకి వస్తుంది. మొన్నటివరకు మనకు విండోస్ సర్వీస్ పాక్-2 మీద పని చేసిన అనుభవం ఉంది. ఎప్పుడైతే మార్కెట్లోకి విండోస్ 7కి సంబంధించినటువంటి బీటా వర్సన్ విడుదలైందో వెంటనే చాలా మంది దాని మీద ప్రయోగాలు మొదలు పెట్టారు. ప్రయోగాలు అంటే అందులో ఉన్నటువంటి కొత్త కొత్త సౌకర్యాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడమే. అటువంటి సమయంలో విండోస్ 7కి సంబంధించినటుంటి కొన్ని బిల్డ్స్ లీక్ అవ్వడం జరిగింది.

అటువంటి సమయంలో లీక్ అయినటువంటి విండోస్ 7 బిల్డ్స్‌ని కూడా ఉపయోగించారు. ఇప్పుడు మార్కెట్ చర్చ అంతా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 8 గురించి. ప్రస్తుతం విండోస్ 8కి సంబంధించినటువంటి ఫీచర్స్ అంతా డవలప్‌మెంట్‌లో ఉంది. ఐతే ఎవరో విండోస్ 8కి సంబంధించిన మొదటి మైల్ స్టోన్(బీటా ఆర్చివ్) ఓ ప్రయివేట్ యఫ్‌టివి సర్వర్ ద్వారా దానికి సంబంధించినటువంటి కంప్లీట్ బిల్డ్ నెంబర్‌తో సహా దొరికింది. ఆ బిల్డ్ నెంబర్ ఏమిటంటే 6.1.7850.0.winmain_win8m1.100922-1508_x86fre_client-enterprise_en-us. iso.

ఐతే ప్రస్తుతానికి ఆ బిల్డ్‌కి సంబంధించినటువంటి సమాచారం పబ్లిక్ టోరెంటోలో లేదు. త్వరలోనే పబ్లిక్‌తోటి ఆ బిల్డ్‌ని షేర్ చేయడం జరుగుతుందని అన్నారు. విండోస్ 8కి సంబంధించినటువంటి కొన్ని స్క్రీన్ షాట్స్ మాత్రం మీకోసం ప్రవేశపెడుతున్నాం. దీనిని బట్టి చూస్తుంటే విండోస్ 7 కంటే కూడా మంచి పవర్ పుల్ ఫీచర్స్‌తో విండోస్ 8ని డవలప్ చేస్తున్నారని ఈ స్క్రీన్ షాట్ చూస్తుంటే తెలుస్తుంది. లీక్ అయినటువంటి విండోస్ 8 బిల్డ్ రాబోవు తరాలను దృష్టిలో పెట్టుకోని డవలప్ చేయడం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot