అక్టోబర్ నెలలో 'విండోస్ 8' విశ్వరూపం

By Prashanth
|
Windows 8


సాప్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాప్ట్ చివరకు విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించి కొత్త సమాచారాన్ని వెల్లడించింది. ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో అధికారకంగా విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్లోకి రానుందని తెలిపింది. అక్టోబర్ నుండి ఇంటెల్, ఎఎమ్‌డి ప్రాసెసర్స్ అన్నీ కూడా విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే రన్ అవనున్నట్లు మైక్రోసాప్ట్ ప్రతినిధులు తెలియిజేశారు.

ఇటీవలే మైక్రోసాప్ట్ విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించి బీటా వర్సన్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ పుల్ వర్సన్ ఎప్పుడెప్పుడు విడదలవుతుందా అని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా టాబ్లెట్స్, కంప్యూటర్స్ ఎక్కువ లాభాన్ని పొందనున్నాయి. ఇప్పటి వరకు వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ సెగ్మెంట్లో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి విండోస్ 8 రాక దెబ్బేనని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇది మాత్రమే కాకుండా రాబోయే కాలంలో స్మార్ట్ ఫోన్స్ కూడా విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానున్నాయి. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే టాబ్లెట్స్ విడుదలైతే, ఆపిల్ ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు గట్టి పోటీనిస్తుందని అంటున్నారు. ఆ విధంగా, విండోస్ 8 తాజా సాంకేతిక ఉత్పత్తులు ప్రతి రెండవ ప్రారంభించింది చేస్తున్నారు, ఇక్కడ డిజిటల్ ప్రపంచంలో నిలబడటానికి ఖచ్చితంగా ఉంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X