మైక్రోసాప్ట్ 'విండోస్ 8' రికార్డు స్దాయి డౌన్‌లోడ్స్

Posted By: Staff

 మైక్రోసాప్ట్ 'విండోస్ 8' రికార్డు స్దాయి డౌన్‌లోడ్స్

 

టెక్నాలజీ అభిమానులు ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూస్తున్న మైక్రోసాప్ట్ విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ ప్రివ్యూ వర్సన్ మొదటి రోజునే 1మిలియన్ డౌన్ లోడ్స్‌ని యూజర్స్ చేసుకోవడం వల్ల రికార్డుని నెలకొల్పింది. మార్చి 1 నుండి విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన ప్రివ్యూ డౌన్ లోడ్స్‌లో లభ్యమవుతుంది. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌ని మైక్రోసాప్ట్ డోన్ లోడ్స్‌లో పెట్టిన 24 గంటల్లోపే 1మిలియన్ డౌన్‌లోడ్స్ జరిగాయని మైక్రోసాప్ట్ అధికారులు తెలిపారు.

ఈ స్టాటటిక్స్ మైక్రోసాప్ట్కి కొత్త ఊత్సాహానిస్తున్నాయి. మైక్రోసాప్ట్ విడుదల చేసిన బీటా వర్సన్  జనాభా, డెవలపర్స్‌తో పాటు అందరి దృష్టిని ఆకర్షించాయి. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ రికార్డు స్దాయి డౌన్ లోడ్స్‌ని నమోదు చేయడానికి గల కారణం టాబ్లెట్స్, కంప్యూటర్స్‌ని సపోర్ట్ చేయడమే. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ క్లౌడ్ కంప్యూటింగ్‌ని కూడా సపోర్ట్ చేయడం అరుదైన విశేషం. దీనిని బట్టి చూస్తుంటే ఇప్పటి వరకు మైక్రోసాప్ట్ విడుదల చేసిన అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌ల మాదిరే విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మార్కెట్లో మంచి సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot