అదిరేటి ఫీచర్స్‌‌తో అలరించడానికి సిధ్దమైన విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్

Posted By: Super

అదిరేటి ఫీచర్స్‌‌తో అలరించడానికి సిధ్దమైన విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్

మైక్రోసాప్ట్ సిఈవో స్టీవ్ బాల్మెర్ విండోస్8 ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించినటువంటి కొత్త వర్సన్ 2012కల్లా మార్కెట్‌‌లోకి విడుదల చేయనున్నామని ఏనాడో చెప్పారు. దీంతో ప్రపంచంలో కెల్లా బాగా పాపులర్ అయినటువంటి మైక్రోసాప్ట్ సంస్ద అందించే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. ఏది ఏమైనాకానీ మైక్రోసాప్ట్ సిఈవో స్టీవ్ బాల్మెర్ మాత్రం విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన కొత్త ఫీచర్స్‌ని మాత్రం వెల్లడించడానికి సిధ్దంగా లేరు.

టోక్యోలో ఉన్నటువంటి మైక్రోసాప్ట్ డెవలపర్స్ ఫోరం చెప్పిన దాని ప్రకారం విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ కోసం చాలా ఎక్కువగా శ్రమ పడుతున్నట్లు వెల్లడించారు. రాబోయే తరం కోసం డెవలప్ చేస్తున్నటువంటి ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చే సంవత్సరం మార్కెట్‌లోకి అడుగుపెట్టనుందని వెల్లడించారు. విండోస్ 7తో గనుక విండోస్ 8ని పోల్చినట్లైతే చాలా వరకు కొత్త ఫీచర్స్ కలిపామని అన్నారు. అంతేకాకుండా విండోస్ 8లో నేర్చుకోవాల్సింది చాలానే ఉందని అన్నారు.

స్టీవ్ బాల్మెర్ స్పీచ్ ప్రకారం పలు టెక్నాలజీ బ్లాగ్స్ వారు చెప్పింది ఏమిటంటే విండోస్ 8లో మనం ఎవరూ ఊహించినటువంటి కొన్ని కొత్త ఫీచర్స్ ఉన్నాయని తెలిపారు. విండోస్ 8లో ఉన్నటువంటి కొన్ని కొత్త ఫీచర్స్ మీకోసం... కొత్త పోకడలు, సంజ్ఞలు, కంప్యూటర్‌లో టచ్ స్క్రీన్‌ని గుర్తించడం మొదలగునవన్నమాట. ఇవి మాత్రమే కాకుండా యూజర్ చేసేటటువంటి యాక్షన్స్ అన్నింటిని విండోస్ 8 గుర్తించగలుగుతుంది. దీని అర్ధం ఏమిటంటే యూజర్స్‌కు వారియొక్క కంప్యూటర్ మీద కంట్రోల్ ఉంటుందన్నమాట.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot