విండోస్ 8 వచ్చేసింది...!

By Super
|
విండోస్ 8 వచ్చేసింది...!


మైక్రోసాఫ్ట్ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టం విండోస్ 8ను గురువారం న్యూయార్క్‌లో ఆవిష్కరించారు. ఇదే వేదిక పై ఆపిల్ ఐప్యాడ్‌కు పోటీగా భావిస్తున్న విండోస్ 8 సర్ఫేస్ టాబ్లెట్‌ను మైక్రోసాఫ్ట్ వర్గాలు ప్రవేశపెట్టాయి. ఈ టాబ్లెట్ పీసీల ధరలు 499డాలర్ల నుంచి ప్రారంభమయ్యే అవకాశముందని ఓ అంచనా. ప్రారంభంలో వీటిని మైక్రోసాఫ్ట్ సొంత స్టోర్స్ ఇంకా సొంత రిటైల్ వెబ్‌సైట్‌ల నుంచే విక్రయించనుంది.

 

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విండోస్8 ఆవిష్కరణ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ స్పందిస్తూ తన సంస్థ నుంచి వస్తున్న ఈ పెద్ద ఆవిష్కరణ కంప్యూటర్ ప్రపంచంలో కొత్త శకానికి నాంది అని అన్నారు. ప్రస్తుతం విండోస్ ఎక్స్‌పీ, విండోస్ విస్టా, విండోస్ 7లతో పీసీలను వినియోగిస్తున్నవారు విండోస్ 8ను రూ.1,999 ధరకే డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన వివరించారు.. 2012, జూన్ 2 నుంచి 2013 జనవరి 31లోపు పీసీని కొనుగోలు చేసే వారు విండోస్ 7 నుంచి విండోస్ 8 అప్‌గ్రేడ్‌కు రూ.699 చెల్లిస్తే సరిపోతుందని ప్రామాణిక్ తెలిపారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X