యూజర్స్ కోసం విండోస్ 8 డెవలపర్స్ బిల్డ్ సమాచారం..

Posted By: Staff

యూజర్స్ కోసం విండోస్ 8 డెవలపర్స్ బిల్డ్ సమాచారం..

ఆపరేటింగ్ సిస్టమ్‌లలో 'కింగ్' లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాప్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. మొన్నటి వరకు విండోస్ సర్వీస్ ప్యాక్ 2, సర్వీస్ ప్యాక్ 3 అంటూ హాడావుడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పడు లేటెస్ట్ ట్రెండ్ విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ అన్న విషయం అందరికి తెలిసిందే. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన డెవలపర్స్ బిల్డ్‌ని ఇటీవలే మైక్రోసాప్ట్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం యూజర్స్ కోసం ప్రత్యేకంగా...

సాధారణంగా టెక్నాలజీ గురించి ఆసక్తి ఉన్నవారు విండోస్ 8లో ఏముందో తెలుసుకోవాలనుకునే కుంటే మైక్రోసాప్ట్ అఫీషియల్‌గా విడుదల చేసిన విండోస్ 8 డెవలపర్ బిల్డ్ ని డౌన్లోడ్ చేసుకొని దాని గురించిన పూర్తి సమాచారం తెలుసుకొవచ్చు. యూజర్స్ డౌన్లోడ్ చేసుకునే ముందు ఒకటి మాత్రం తెలుసుకోవాలి ఇది స్టేబుల్ ఎడిషన్ కాదు దీనిలో యూజర్స్ ఇంటర్ఫేజ్ కి సంబంధించిన ఎన్ హాన్స్మెంట్స్ మరియు ఇతర విండోస్ ఫీచర్లు జతచెయ్యబడలేదు. కాకపోతే విండోస్ 8 ఎలా ఉంటుందనే అవగాహన వస్తుంది.

థర్డ్ పార్టీ అప్లికేషన్ డెవలపర్లు కంపాటిబిలిటీ సమస్యలు తలెత్తకుండా తమ అప్లికేషన్లను డెవలప్ మరియు టెస్ట్ చేసుకోవటానికి అవసరమయ్యే ఫీచర్లు ఈ విండోస్ 8 డెవలపర్ బిల్డ్ లో ఉన్నాయి. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ డెవలపర్స్ ప్రివ్యూకి సంబంధించిన డౌన్లోడ్ కోసం ఈ లింక్ http://msdn.microsoft.com/en-us/windows/apps/br229516ని మీ బ్రౌజర్లో క్లిక్ చేసి పొందవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot