విండోస్ ఫోన్ 7మొబైల్స్‌లో కూడా గూగుల్ ప్లస్ అప్లికేషన్

Posted By: Super

విండోస్ ఫోన్ 7మొబైల్స్‌లో కూడా గూగుల్ ప్లస్ అప్లికేషన్

కాలిఫోర్నియా: సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపోందించినటువంటి గూగుల్ ప్లస్ అప్లికేషన్‌ని మైక్పోసాప్ట్ విండోస్ ఫోన్ 7 ఫ్లాట్ ఫామ్‌లో వచ్చే వారం ప్రవేశపెట్టనుందని సమాచారం. వివరాల ప్రకారం విండోస్ ఫోన్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఏమేమి స్మార్ట్ పోన్స్ ఐతే రన్ అవుతున్నాయో వాటన్నింటిలో ఉన్న ఫేస్‌బుక్ అప్లికేషన్ కంటే మరిన్ని బెటర్ ఫీచర్స్‌ని గూగుల్ ప్లస్ అప్లికేషన్ అందిస్తుందని అంటున్నారు. కొత్తగా రూపోందినటువంటి ఈ గూగుల్ ప్లస్ అప్లికేషన్‌ని అన్ని రకాల మొబైల్ ఫ్లాట్ ఫామ్స్ సరిపోయే విధంగా రూపోందించడమే తమ ముఖ్య ఉద్దేశ్యం అని గూగుల్ ప్రతినిధి తెలియజేశారు.

విండోస్ ఫోన్ 7 యూజర్స్ ఈ గూగుల్ ప్లస్ అప్లికేషన్ ద్వారా షేర్ చేసినటువంటి ఫోస్ట్‌లను కూడా ఎడిట్ చేసుకునే సౌకర్యం ఉంది. అంతేకాకుండా యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారు మొబైల్స్ ద్వారా డైరెక్ట్‌గా గూగుల్ ప్లస్ లోకి ఫోటోలను అప్ లోడ్ చేయవచ్చు. ఈ కొత్త అప్లికేషన్‌లో సౌకర్యవంతమైన చాటింగ్ సర్వీస్‌ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇటీవలే గూగుల్ కంపెనీ గూగుల్ ప్లస్ ఐఫోన్ అప్లికేషన్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌‌కి సంబంధించిన గూగుల్ ప్లస్ అప్లికేషన్‌ని కూడా విడుదల చేస్తామని తెలిపారు.

ఇది ఇలా ఉంటే గూగుల్ కొత్తగా రూపోందించినటువంటి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ గూగుల్ ప్లస్ విడుదల తేదీని మాత్రం ఇంకా నిర్ణయించ లేదు. గూగుల్ ప్లస్ బీటా వర్సన్‌ని విడుదల చేసిన మూడు వారాలేక 20 మిలియన్ యూజర్స్ అందులో చేరగా తక్కువ కాలంలో అత్యంత మంది యూజర్స్‌ నమోదు చేసిన సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్‌గా గూగుల్ ప్లస్ రికార్డు సృష్టించింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot