రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది..ఫ్యాన్స్‌లో పెరుగుతున్న ఉత్కంఠ!

Posted By: Prashanth

రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది..ఫ్యాన్స్‌లో పెరుగుతున్న ఉత్కంఠ!

 

మైక్రోసాఫ్ట్ కొత్త తరం ఆపరేటింగ్ సిస్టం విండోస్ 8 విడుదలకు రంగం సిద్ధమవుతోంది. అక్టోబర్ 25న జరగబోయే విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం (పీసీ వర్షన్) ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన మైక్రోసాఫ్ట్ టెక్ మీడియా ప్రపంచానికి ఆహ్వాన పత్రాలను ఇప్పటికే పంపింది. ఇదే రోజున విండోస్ 8 ఆధారితంగా స్పందించే సర్‌ఫేస్ టాబ్లెట్‌లను విడుదల చేస్తారు. మరో వైపు అక్టోబర్ 29న శాన్‌ఫ్రాన్సిస్కో‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విండోస్ ఫోన్8 (మొబైల్ వర్షన్) ఆపరేటింగ్ సిస్టంను ఆవిష్కరించునున్నారు.

‘విండోస్ ఫోన్ సెంట్రల్’ద్వారా సేకరించిన సమాచారం మేరకు మైక్రోసాఫ్ట్, అక్టోబర్ 29, సోమవారం ఉదయం 10 గంటలకు శాన్‌ఫ్రాన్సిస్కో‌లో ప్రత్యేక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ‘అపోలో’(Apollo) కోడ్ నేమ్‌తో పిలవబడుతున్న విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టంను ప్రదర్శిస్తారు. ఈ ఆవిష్కరణ అనంతరం విండోస్ 8 ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లు నవంబర్ 4 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం ప్రత్యేక ఫీచర్లు:

మల్టీకోర్ సపోర్ట్,

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్/వాలెట్ సపోర్ట్,

మైక్రోఎస్డీ కార్డ్ స్టోరేజ్ (రిమూవబుల్),

రిసల్యూషన్స్ (1280 x 768), (1280 x 720), (480×800),

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot