అంతానికి కౌంట్ డౌన్ స్టార్ట్..?

Posted By: Super

 అంతానికి కౌంట్ డౌన్ స్టార్ట్..?

 

గత కొద్ది సంవత్సరాల కాలంగా కంప్యూటింగ్ ప్రపంచానికి విశిష్టసేవలందిస్తున్న అత్యుత్తమ ఆపరేటింగ్ సిస్టం విండోస్ ఎక్స్‌పీ మరికొద్ది రోజుల్లో కనుమరుగు కానుంది. నివ్వెరపాటకు‌లోను చేసే ఈ వార్తను యూఎస్‌కు చెందిన ఓ ప్రముఖ బ్లాగ్ ప్రచురించింది. నవీకరణ నేపధ్యంలో ఈ నిర్ణయం అనివార్యమైనట్లు తెలుస్తోంది. ఎక్స్‌పీకి అప్‌డేటెడ్ వర్షన్‌లుగా విండోస్ 7, విండోస్ విస్టాలు వినియోగంలోకి వచ్చిన విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ తాజా నిర్ణయంతో ఏప్రిల్ 8, 2014, నాటికి విండోస్ ఎక్స్‌పీ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2003ల సేవలు పూర్తిగా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశం పై మైక్రోసాఫ్ట్ మార్కెటింగ్ డైరెక్టర్ స్టెల్లా చెర్నాయక్ స్పందిస్తూ

ఎక్సీ‌పీ యూజర్లు నిర్ణీత సమయం లోపే విండోస్ 7 లేదా విస్టాకు మైగ్రేట్ కావాలని సూచించారు.

బెంగాల్ టైగర్ గంగూలీ కొత్త ఆండ్రాయిడ్ అప్లికేషన్ విశిష్టత ఏంటి..?

ఐపిఎల్ టి20లో పూణె వారియర్స్ జట్టుకు నాయకుడిగా క్రీయాశీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్న భారత మాజీ సారధి సౌరభ్ గంగూలీ పేరున మొబైల్ అప్లికేషన్‌ని విడుదల చేశారు. ఈ అప్లికేషన్ ద్వారా పూణె వారియర్స్ ఇండియాకు సంబంధించిన న్యూస్‌ని తెలుసుకోవచ్చు. ప్రపంచంలో ఇలా ఒక క్రికెటర్ మీద మొబైల్ అప్లికేషన్‌ని విడుదల చెయ్యడం ఇదే మొదటి సారి. ఈ అప్లికేషన్ ద్వారా అభిమానులు లేటెస్ట్ న్యూస్, ట్వీట్స్, పిక్చర్స్, వీడియోలతో పాటు పూణె వారియర్స్ ఇండియాకు సంబంధించిన స్కోరు కార్డ్స్‌ని పొందుతారు.

క్యానీశ్రీజల్ వారి సౌజన్యంతో సౌరభ్ గంగూలీ పేరున ఈ అప్లికేషన్‌ని రూపొందించామని ఎస్‌సిగంగూలీడాట్‌కామ్ ప్రతినిధి తెలిపారు. ఈ అప్లికేషన్ గూగుల్ ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్ ‘గూగుల్ ప్లే’ నుండి ఉచితంగా ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot