నైతిక విలువలున్న కంపెనీలుగా విప్రో, టాటా స్టీల్

Posted By: Super

నైతిక విలువలున్న కంపెనీలుగా విప్రో, టాటా స్టీల్

 

ముంబై: టాటా స్టీల్ మరియు విప్రో కంపెనీలు ప్రపంచంలో అత్యంత నైతిక సంస్థలలో ఒకటిగా పేరు తెచ్చుకున్నాయని అమెరికాకు చెందిన ఎతీ స్పియర్ ఇన్స్టిట్యూట్ కంపెనీ అధికారులు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళితే అమెరికాకు చెందిన ఎతీ స్పియర్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన 2012 అత్యంత నైతిక సంస్థలలో ఇండియాకు చెందిన టాటా స్టీల్ మరియు విప్రో కంపెనీలకు చోటు దక్కించుకున్నాయి.

ఈ సందర్బంలో టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌ఎమ్ నేరుర్కార్ మాట్లాడుతూ  ఇటువంటి ముఖ్యమైన, ప్రతిష్టాత్మక పారామీటర్ కింద గుర్తింపు టాటా స్టీల్ కోసం ఒక గొప్ప గౌరవం. నైతిక వ్యాపార సూత్రాలు మరియు  పద్ధతులు ప్రారంభమైన నాటి నుండి టాటా గ్రూప్ మరియు టాటా స్టీల్ ప్రత్యేకతలు ఉన్నాయని అన్నారు.

ఎతీ స్పియర్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నైతిక సంస్థలు అన్నీ కూడా నైతిక వ్యాపార సూత్రాలను అవలంభిస్తున్నాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు(అమెరికా, బ్రిటన్, జపాన్, పోర్చుగల్, ఇండియా) నుండి సుమారు 145 కంపెనీలను నైతిక విలువలున్నీ కంపెనీలుగా గుర్తించామని అన్నారు. కంపెనీ స్టాండర్ట్స్, పరపతి, కార్పోరేట్ సిటిజన్ షిప్, వాతావరణం, పద్దతులు లాంటి అన్నింటిని దృష్టిలో పెట్టుకోని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 5000 కంపెనీలలో 145 కంపెనీలను గుర్తించామని తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot