ఐటి రంగంలో అత్యధిక పారితోషికం తీసుకోబోతున్న విప్రో కొత్త సీఈవో

Posted By: Staff

ఐటి రంగంలో అత్యధిక పారితోషికం తీసుకోబోతున్న విప్రో కొత్త సీఈవో

ముంబయి: విప్రో కొత్త సీఈవో టీకె కురియన్‌ వార్షిక జీతం ప్యాకేజీ అన్ని కలుపుకుని రూ10 కోట్లు. ఆయనకు ఇచ్చిన అపాయింట్‌ మెంట్‌లో కనిష్టంగా రూ3 కోట్లు గరిష్టంగా రూ10 కోట్లని విప్రో బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేం జీకి తెలిపింది. ఈ ప్యాకేజీలో పీరియాడిక్‌ ఇంక్రిమెంట్లు, వెరియబుల్‌ పే ( వారి పనితనాన్ని బట్టి ప్రోత్సాహం) లీవ్‌ ట్రావెల్‌ ఎలవెన్సు, హౌస్‌రెంట్‌ ఎలవెన్సు, కంపెనీ కారు, డ్రైవర్‌, ఫర్నిషడ్‌ ఇల్లు అన్ని కలిపి.. దేశంలోనే ఐటి రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే వారి కురియన్‌ అగ్రస్థానంలో ఉన్నారు.

2009, ఏప్రిల్ నుంచి అదే ఏడాది అక్టోబర్ 5 కాలానికి టీసీఎస్ సీఈవో, ఎండీ, ఎస్ రామదొరై ప్యాకేజీ రూ 3.61 కోట్లుగా ఉంది. ఇన్పోసిస్‌ ఎండీ గోపాలకృష్ణన్‌ వార్షిక జీతం రూ 1.01 కోట్లు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot