విప్రో స్టాఫ్ బస్సులలో వై-ఫై కనెక్టువిటీ!

Posted By:

భారతదేశపు ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో ఉద్యోగుల సౌకర్యార్థం బెంగుళూరులోని తమ కంపెనీకి సంబంధించిన స్టాఫ్ బస్సులలో ఉచితం వై-ఫై కనెక్టువిటీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ పైలెట్ ప్రాజెక్టుకు సంబంధించి విప్రో, సిస్టిమా శ్యామ్ టెలీసర్వీసెస్ తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రముఖ పత్రిక వెల్లడించింది.

ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావటం ద్వారా 1,46,000 ఐటీ ఉద్యోగులు తాము ప్రయాణీంచే కంపెనీ బస్సులలో ఇంటర్నెట్ ను ఉపయోగించుకోగలుగుతారు. ప్రారంభ దశలో భాగంగా కంపెనీకి సంబంధించిన 100 స్టాఫ్ బస్సులలో వై-ఫై కనెక్టువిటీని ఇన్స్‌స్టాల్ చేయనున్నారు.

బెంగుళూరు రహదారుల పై ఉచిత ‘నమ్మా వై-ఫై' సేవలు!

నగరంలోని ఎంజి రోడ్, బ్రిగేడ్ రోడ్ ఇంకా నాలుగు ఇతర ప్రాంతాల్లో ఉచిత వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్టువిటీ సేవలు ప్రారంభమైయ్యాయి. ‘నమ్మా వై-ఫై'(‘Namma Wifi') పేరుతో ప్రారంభమైన ఈ ఉచిత ఇంటర్నెట్ సర్వీస్‌ను దేశంలో ప్రారంభించటం ఇదే మొదటిసారి.

ఆయా అనుకూల ప్రాంతాల (హాట్‌స్పాట్‌ల) వద్ద ఉచిత వై-ఫైను యాక్సిస్ చేసుకోదలచిన వారు ముందుగా తమ డివైస్‌లోని బ్రౌజర్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వెనువెంటనే ‘నమ్మా వైఫై' పేజీకి సదరు బ్రౌజర్ మరల్చబడుతుంది. వై-ఫైను యాక్సిస్ చేసుకునే క్రమంలో మీ మొబైల్ ఫోన్‌కు ఓ పాస్‌వర్డ్ పంపబడుతుంది. ఆ పాస్‌వర్డ్ ఆధారంగా రోజు మొత్తం మీద 30 నిమిషాల పాటు ఉచితంగా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకునే అవకాశాన్నీ మీకు కల్పిస్తారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot