Home
News

ఏపీలో 10,000 కొత్త ఐటీ ఉద్యోగాలు

ఏపీలో 10,000 కొత్త ఐటీ ఉద్యోగాలు

ప్రముఖ ఐటీ కంపెనీలైన విప్రో, టెక్ మహీంద్రాలు 2015కుగాను ఆంధ్రప్రదేశ్ యువతకు 10,000కు పైగా ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేవ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. వీటిలో 6,400 ఉద్యోగాలను విప్రో కల్పిస్తుందని, మరో 5,000 ఐటీ ఉద్యోగాలను టెక్ మహీంద్రా ఏర్పాటు చేస్తుందని దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం మరింత అభివృద్థి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

టెక్ మహీంద్రాలో 30,000 కొత్త ఉద్యోగాలు

అంతర్జాతీయంగా వచ్చే రెండు సంవత్సరాల కాలంలో తమ గ్లోబల్ సీటింగ్ సామర్థ్యాన్ని 1.25లక్షలకు పెంచుకుంటామని టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీ తెలిపారు. ప్రస్తుతం తమకు 95,000 గ్లోబల్ సీటింగ్ సామర్థ్యం ఉందని, దేశంలోని 5వ అతిపెద్ద ఐటీ కంపెనీగా తాము అవతరించామని ఆయన తెలిపారు. త్వరలో విస్తరించే 30,000 సీటీంగ్‌లో అత్యధిక శాతం కేటాయింపు హైదరాబాద్, బెంగుళూరు, పూణేలతో పాటు విశాఖపట్నం, జైపూర్, భువనేశ్వర్‌లలో ఉంటుందని ఆయన తెలిపారు.

ఏపీలో 10,000 కొత్త ఐటీ ఉద్యోగాలు

20,000 మందికి పైగా నిపుణులతో హైదరాబాద్‌లో తమకు అతిపెద్ద కేంద్రం ఉందని గుర్నానీ తెలిపారు. విశాఖపట్నంలో తమకు1500 మంది ఉద్యోగులున్నారని ఈ సంఖ్యను మరింత పెంచేందుకు మరికొంత స్థలాన్ని కేటాయించినట్లు వివరించారు. అలానే, భువనేశ్వరలో నిర్మించిన కొత్త బ్లాక్‌లో 600 మందికి అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. తమ ఆదాయంలో 2-3% నిధులను పరిశోధన- అభివృద్థికి కేటాయిస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ శివారు ప్రాంతమైన బహదూర్‌పల్లిలో ఇన్నోవేటివ్ ల్యాబ్స్ నిర్మాణం నిమిత్తం 100 మిలియన్ డాలర్లను వెచ్చించామని ఆయన వెల్లడించారు. టెక్ మహీంద్రా చేపట్టబోయే 30,000 సీటింగ్ విస్తరణలో భాగంగా మరో రెండు సంవత్సరాల కాల వ్యవధిలో 30,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగావకాశం లభించనుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Wipro, Tech Mahindra to offer 10 thousand jobs in Andhra Pradesh. Read more in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X