ఎనిమిదవ సారి ఎఎస్‌టిడి అవార్డుని దక్కించుకున్న విప్రో

Posted By: Super

ఎనిమిదవ సారి ఎఎస్‌టిడి అవార్డుని దక్కించుకున్న విప్రో

దేశంలో రెండవ అతి పెద్ద ఐటి కంపెనీ 'విప్రో' మళ్లీ అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. ఆ అరుదైన రికార్డు ఏమిటంటే అమెరికన్‌ సొసైటీ ఫర్‌ ట్రైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఎఎస్‌టిడి) నుంచి వరుసగా ఎనిమిదవ సంవత్సరంలోనూ విప్రో 'బెస్ట్‌' అవార్డును పొందింది. ఈ విషయాన్ని విప్రో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ డి సెల్వన్‌ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును ఎఎస్‌టిడి ప్రెసిడెంట్‌ టోనీ బింగామ్‌ చేతుల మీదుగా అందుకున్నామని ఆయన వివరించారు. విప్రో కంపెనీకి ట్రైనింగ్‌, డెవలప్‌మెంట్‌ విభాగాల్లో ఇంతటి ఘనమైన గుర్తింపు లభించడం సంస్థకు గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి అవార్డులు మున్ముందు కాలంలో విప్రో మరిన్ని సొంతం చేసుకొవాలని, అంచెలంచలుగా మరింత అభివృద్దిని కంపెనీ సాధించాలని కొరుకుంటున్నామని తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot