2011 సంవత్సరానికి మైక్రోసాప్ట్ అవార్డుని గెలిచిన విప్రో

Posted By: Staff

2011 సంవత్సరానికి మైక్రోసాప్ట్ అవార్డుని గెలిచిన విప్రో

దేశీయ మూడవ అతిపెద్ద సాప్ట్ వేర్ దిగ్గజం విప్రో 2011 సంవత్సరానికి గాను 'మైక్రోసాప్ట్ సాప్ట్ వేర్ డెవలప్ మెంట్ పాట్నర్ అవార్డు'ని సొంతం చేసుకుంది. ఈ సందర్బంలో విప్రో ప్రతినిధులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మైక్రోసాప్ట్ కస్టమర్స్‌కు అందించిన సేవలకు అనుగుణంగా ఈ అవార్డు లభించడం జరిగిందన్నారు. మైక్రోసాప్ట్ టెక్నాలజీని ఉపయోగించే కస్టమర్స్‌కు మార్కెట్లో ఎటువంటి ఇబ్బందలు కలగకుండా సోల్యుషన్స్ అందివ్వడం జరిగిందన్నారు.

ఈ సందర్బంలో విప్రో టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ హెడ్(బిజినెస్ అప్లికేషన్స్ సర్వీసెస్) శ్రీని పల్లియా మాట్లాడుతూ ఇలాంటి గౌరవప్రదమైన అవార్డులు రావడం విప్రో యొక్క సామర్ద్యం ప్రపంచ దేశాలలో ఉన్న కస్టమర్స్‌కు తెలుస్తుందని అన్నారు. ఇది మాత్రమే కాకుండా కస్టమర్స్ యొక్క అభిరుచులకు తగ్గట్టుగా సోల్యుషన్స్‌ని డెలివరీ చేయడంలో విప్రో ఎప్పుడూ ముందు ఉంటుందని తెలియజేశారు.

ఈ అవార్డుని మైక్రోసాప్ట్ ప్రపంచ వ్యాప్తంగా 3,000 మంది ఎంట్రీలను తీసుకొని వివిధ భాగాలలో అందజేయడం జరిగింది. విప్రో టెక్నాలజిస్‌కి మైక్రోసాప్ట్ డెవలప్ మెంట్‌కి అత్యధ్బతమైన సర్వీస్‌ని అందించినందుకు గాను ఈ అవార్డుని ప్రకటించడం జరిగిందన్నారు. ఈ అవార్డు రావడంతో విప్రో టెక్నాలజీస్ భాద్యత మరింత పెరిగిందని తెలియజేశారు. దీంతో విప్రో టెక్నాలజీస్ ప్రపంచం మొత్తానికి చక్కని బిజినెస్ సోల్యుషన్స్‌ని అందిస్తుందని అన్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting