డోంట్ వర్రీ!!..అప్పటికప్పుడు ఫుల్ ఛార్జ్!

Posted By: Prashanth

డోంట్ వర్రీ!!..అప్పటికప్పుడు ఫుల్ ఛార్జ్!

 

ప్రయాణంలో ఉన్నప్పుడే మీ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందా..?, ఏం పర్వాలేదు రెప్పపాటులో తిరిగి ఛార్జ్ చేసుకోవచ్చు..., అంత ఫాస్టుగా ఏలా సాధ్యమనుకుంటున్నారా..?, మార్కెట్లో విడుదలైన మోజో కార్డ్‌లెస్ ఛార్జర్ ద్వారా ఇది సాధ్యమే. ఈ పోర్టబుల్ డివైజ్‌ను మీ వెంట పెట్టకుంటే చాలు.. అత్యవసరం సమయాల్లో ఛార్జింగ్ లేదన్న బెడదే ఉండదు. ఈ పోర్టబుల్ ఛార్జర్ బాహ్య విద్యుత్ సరఫరా లేకుండా మొబైల్ ఫోన్, ఐపోడ్, ఐఫోన్, మ్యూజిక్ ప్లేయర్లతో పాటు ఇతర గేమింగ్ డివైజ్‌లను అప్పటికప్పుడే ఛార్జ్ చేసేస్తుంది.

ఈ డివైజ్‌లో పొందుపరిచిన లెవల్ ఇండికేటర్ టెక్నాలజీ, మీ గ్యాడ్జెట్ బ్యాటరీ స్థాయిని గుర్తించి క్షణాల్లో ఆ ఖాళీరి భర్తీ చేస్తుంది. శక్తవంతమైన 2200mAh లయాన్ రీఛార్జబుల్ బ్యాటరీలను ఈ కార్డ్‌లెస్ ఛార్జర్‌లో నిక్షిప్తం చేయ్యటం కారణంగా విద్యుత్ నిల్వ ఉంటుంది. ఈ విద్యుత్‌ను ఛార్జింగ్ అవసరమైన వాటిలోకి చిన్న కేబుల్ ఆధారితంగా షేర్ చేసుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో మోజో కార్డ్‌లెస్ స్పీకర్ ధర రూ.1000.

మీ డేటాకు మరింత భద్రత!!

పోర్టబుల్ డేటా స్టోరేజ్ డివైజ్‌లను రూపొందించటంలో ప్రత్యేక గుర్తింపు పొందిన సంస్థ రాక్‌స్టార్ (rocstar)ఓ విప్లవాత్మక ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. డేటాను మరింత భద్రతతో పదిలపరిచే పోర్టబుల్ హార్డ్‌డ్రైవ్‌ను సంస్ధ డిజైన్ చేసింది. జనవరిలో నిర్వహించిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో వేదిక పై ఈ హార్డ్‌డ్రైవ్‌ను ఆవిష్కరించారు. సాధారణంగా మనం ముఖ్యమైన డేటాను పెన్‌డ్రైవ్, సీడీ లేదా డీవీడిల్లో భద్రపరుస్తుంటాం. మనం నిక్షిప్తం చేసిన డేటాకు ఈ డివైజ్‌లు పూర్తి స్థాయి రక్షణను కల్పించలేవు. ఈ సమస్యను అధిగమిస్తూ రాక్‌స్టార్ సంస్థ మిలటరీ సెక్యూరిటీ వ్యవస్థతో కూడిన పోర్టబుల్ హార్డ్‌డ్రైవ్‌ను వ్ళద్ధి చేసింది. క్లిష్టమైన ఎన్‌క్రిప్ఫిన్ కోడ్‌తో కూడిన రక్షణ వలయాన్ని ఈ డివైజ్‌లో ఏర్పాటు చేశారు. ఈ సురక్షిత వ్యవస్థ మీ డేటాకు పూర్తి స్థాయి భరోసాను కల్పిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot