ఆండ్రాయిడ్ ఫోన్‌లో బెస్ట్ అప్లికేషన్స్ రన్ చేయాలంటే రూటింగే కరెక్ట్

రూటింగ్ అంటే ఏమి లేదండీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అడ్మినిస్ట్రేటర్స్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో సూడో లాగా అన్నమాట. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో రూట్ యాక్సెస్ ఉపయోగించి మనకు కావాల్సినటువంటి అప్లికేషన్స్‌ని, కస్టమ్ సర్వీసెస్‌ని ఇనిస్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం కస్టమ్ రామ్‌ని ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇనిస్టాల్ చేయడం కన్నా, దానిని రూటింగ్ చేయడం చాలా సులభం. కస్టమ్ రామ్‌ని ఇనిస్టాల్ చేసుకోవడం వల్ల మనకు చాలా ఫీచర్స్‌ని అందుబాటులోకి తెచ్చుకోవచ్చు. ఏమేమి ఫీచర్స్ అందుబాటులోకి వస్తాయో ఒకసారి చూద్దాం...
* బిజి బాక్స్ యాడ్స్ ట్రూ లైనక్స్ కమాండ్స్
బిజి బాక్స్ కి మరోపేరు స్విస్ ఆర్మీ ఎంబెడెడ్ లైనక్స్. ఇది ఓరిజినల్ లైనక్స్ కమాండ్ కాకపోయినప్పటికీ దీని ద్వారా మనం అన్ని లైనక్స్, యునిక్స్ కమాండ్స్‌ని రన్ చేసుకోవచ్చు. కమాండ్స్‌ని ఇనిస్టాల్ చేయకుండానే ఆండ్రాయిడ్‌లో లైనక్స్‌ని రన్ చేయవచ్చు.
* వై - ఫై హుస్ట్‌గా వైర్‌లెస్ టెధర్
వైర్‌లెస్ టెధర్ దీని గురించి చెప్పాలంటే మొబైల్ డివైజెస్‌లో ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఫీచర్ ఇది. ఈ ఫీచర్ ఉన్న మొబైల్ ఎల్లప్పటికీ వాడుకలో ఉంటుంది. వైర్‌లెస్ టెధర్ అప్లికేషన్‌ని ఆండ్రాయిడ్‌లో ఉంచడం వల్ల మనకు దగ్గరలో ఉన్నటువంటి వై - ఫై డివైజెస్‌ని ఈజీగా కనిపెట్టిగలిగే సామర్ద్యం దీనికి ఉంటుంది.
* ఫోన్ స్పీడ్, బిహేవియర్ కనుక్కోవడానికి సిపియు కంట్రోల్స్
ఆండ్రాయిడ్ ఫోన్ ప్రాసెసర్ స్పీడ్‌ని కంట్రోలింగ్ చేయడానికి మనం ఉపయోగించే టూల్ సెట్ సిపియు టూల్. దీని వల్ల యూజర్ ప్రస్తుతం ఉన్న సమయంలో ప్రాసెసర్ ఎంత స్పీడ్, స్లోగా పని చేస్తుందని తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా స్క్రీన్ ఆగిపోయినప్పుడు ఈ సెట్ సిపియుని ఉపయోగించి సరిచేయవచ్చు. ఇది మాత్రమే కాకుండా స్క్రీన్ రేంజి 240MHz and 806MHz వరకు మనం సెట్ చేయవచ్చు. సెట్ సిపియు ఆఫ్షన్ వల్ల ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్చమ్ ఉష్ణోగ్రతను కూడా మనం గ్రహించవచ్చు.


Click it and Unblock the Notifications








