తెలివితేటలు పెరగాలంటే మొబైల్ ఫోన్‌లను పక్కనపెట్టాల్సిందే!!!
మీలోని కళాత్మకతకు మరింత సానపెట్టాలనుకుంటున్నారా..?, అయితే సాంకేతికతకు స్వస్తిపలికి ప్రకృతితో స్నేహం చేయండి. సైన్స్ డైలీ డాట్ కామ్ ఈ మధ్య కాలంలో ప్రచురించిన ఓ అధ్యయనం తాలుకా వివరాలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి.నిపుణుల సమక్షంలో నిర్వహించబడిన ఈ సర్వేలో 30 మంది పురుషులతో పాటు 26 మంది మహిళలు పాల్గొన్నారు. వీరంతా నాలుగు నుంచి ఆరు రోజుల పాటు నిర్వహించిన ఓ విహారయాత్రలో పాల్గొనటం జరిగింది. వీరు తమ ప్రయాణంలో భాగంగా ఏ విధమైన ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకువెళ్లలేదు.

అధ్యయనంలో భాగంగా ప్రయాణానికి ముందు 24 మందికి 10 - ఐటెమ్ క్రియేటివిటీ పరీక్షను నిర్వహించారు. అదే 24 ముందికి ఇదే పరీక్షను 4 రోజుల తరువాత కూడా నిపుణుల బృందం నిర్వహించింది. ఈ పరీక్షలో భాగంగా పరీక్షలో పాల్గొన్న 24 మంది కళాత్మకత మునపటితో పోలిస్తే మరింతగా మెరుగుపడిందని అధ్యయనంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్ స్ట్రేయర్ తెలిపారు. సహజసిద్ధమైన ప్రకృతిలో సహవాసం చేయటం ద్వారా మేధస్సు మరింత ధృడపడగలదని విశ్లేషకులు వాపోతున్నారు. ఏదేమైనప్పటికి మితిమీరుతున్న సాంకేతికత మనిషిలోని కళాత్మకతను హరించి వేస్తుంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








