ఫేస్‌బుక్ సరదా మహిళ ప్రాణం తీసింది!

Posted By:

నిర్లక్ష్యం... బాధ్యతారాహిత్యం... అవగాహన లేమి కారణంగా అనేకమంది జీవితాలు అర్థంతరంగా ముగుస్తున్నాయి. తప్పతాగి డ్రైవ్ చేయటం... సీటు బెల్ట్ పెట్టుకోకపోవటం వంటి అంశాలకు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుండగా ఇటీవల వెల్లడైన ఓ అధ్యయనం రోడ్డు ప్రమాదాలకు సెల్‌ఫోన్ కూడా ఓ ప్రధాన కారణమని నిర్థారించింది. డ్రైవింగ్ సమయంలో మొబైల్ టెక్స్టింగ్ ప్రమాదానికి సంకేతం. అయినప్పటికి ఈ వాస్తవాన్ని చాల మంది గ్రహించరు. వాహన చోదకులకు ఈ ఘటన ఓ కనవిప్పు కాగలదని భావిస్తున్నాం..

ఫేస్‌బుక్ సరదా మహిళ ప్రాణం తీసింది!

  ప్రమాదానికి కొద్ది సెకన్ల ముందు కౌర్ట్నీ స్టాన్‌ఫోర్డ్ ఫేస్‌ బుక్‌లో పోస్ట్ చేసిన సెల్ఫీ ఇదే

ఫేస్‌బుక్ సరదాలకు మరో ప్రాణం బలైంది. కౌర్ట్నీ స్టాన్‌ఫోర్డ్ అనే మహిళ ఫేస్‌బుక్‌లో తన సెల్ఫీని పోస్ట్ చేసిన కొద్ది సెకన్లకు కారు ప్రమాదంలో దుర్మరణంపాలైంది. యూఎస్ హైవే పై కారులో ప్రయాణిస్తున్న మహిళ కౌర్ట్నీ స్టాన్‌ఫోర్డ్ ఫేస్‌బుక్‌లో తన సెల్ఫీని పోస్ట్ చేసిన కొద్ది సెకన్లకే ఎదురుగా వెళుతున్న రిసైకిలింగ్ ట్రక్‌ను ఢీకొని మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన గురువారం ఉదయం 8.33 నిమిషాల ప్రాంతంలో చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఆమె ఉద్యోగానికి వెళుతున్న తరుణంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు దర్యాప్తులో భాగంగా వెల్లడైంది.

డ్రైవింగ్ చేస్తున్న సమయంలో స్మార్ట్ ఫోన్ ను వినియోగించవద్దని పదేపదే హెచ్చరికలు జారీ అవుతున్నప్పటికి ఫలితం లేకుండా పోతోంది. డ్రైవింగ్ చేసే సమయంలో ఏకాగ్రత తప్పనిసరి. ఈ సమయంలో ఫోన్ ఏకాగ్రతను మరల్చటంతో పాటు ప్రమాదాలకు తావిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot