ఐఫోన్ కోసం గడ్డకట్టే నీటిలోకి దూకేసింది

Written By:

స్మార్ట్‌ఫోన్‌ల పై ఎనలేని మక్కువను పెంచుకుంటున్న నేటి యువత వాటిని కాపాడుకునేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయటం లేదు. తాజాగా చోటు చేసుకున్న మరో సంఘటన స్మార్ట్‌ఫోన్‌లకు యువత అడిక్ట్ అవుతోన్న తీరును ఉదహరించేలా ఉంది.

ఐఫోన్ కోసం గడ్డకట్టే నీటిలోకి దూకేసింది

చైనాకు చెందిన ఓ యువతి నీటిలో పడిపోయిన తన ఐఫోన్ 5ను కాపాడుకునేందుకు గడ్డకట్టిన నీటిలోకి దూకేసింది. చైనాలోని బీజింగ్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. పీపుల్స్ డైలీ వెల్లడించిన వివరాల మేరకు గుర్తుతెలియన ఓ యువతి బీజింగ్‌లోని Longtan సరస్సులో తన ఐఫోన్5ను యాధృచ్చికంగా పడేసుకుంది.

ఐఫోన్ కోసం గడ్డకట్టే నీటిలోకి దూకేసింది

అయితే, ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నీటిలో పడిపోయిన తన ఫోన్ కోసం 2 మీటర్ల లోతైన నీటిలోకి ఆమె దూకేసింది. ఆ రోజు అక్కడి వాతావరణం చాలా చల్లగా ఉండటతో నీటిలోచి చల్లదనం -2 డిగ్రీల నుంచి 9 వరకు ఉండొచ్చని సదరు పత్రిక వెల్లడించింది.

Read More : ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

ప్రాణాలను సైతం పణంగా పెట్టి, ఈ యువతి తన ఐఫోన్ ను కాపాడుకున్న తీరును పలువురు తప్పుబడుతున్నారు. నేటి యువత ఫోన్‌లకు ఇస్తోన్న ప్రాధాన్యత జీవితాలకు ఇవ్వటం లేదని పలువురు అంటున్నారు.

English summary
A woman dove into a freezing lake to save her iPhone 5. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot